NTV Telugu Site icon

New CEO of Twitter: ట్విట్టర్‌కు కొత్త సీఈవోగా పెంపుడు కుక్క..! ఎలాన్‌ మస్క్‌పై నెటిజన్ల ఫైర్‌

Elon Musk

Elon Musk

New CEO of Twitter: టెస్లా అధినేత, ట్విట్టర్‌ సీఈవో ఎలాన్‌ మస్క్‌ చేసిన ట్వీట్లు ఓవైపు హాస్యం పంచుతున్నా.. మరో వైపు తీవ్ర వివాదానికి దారి తీశాయి.. ముఖ్యంగా భారతీయులు తీవ్రస్థాయిలో ట్విట్టర్‌ చీఫ్‌పై ఫైర్‌ అవుతున్నారు.. నిత్యం వార్తల్లో వ్యక్తిగా నిలుస్తూ వివాదాస్పద పోస్టులతో చెలరేగిపోయే టెస్లా చీఫ్.. ఇప్పుడు చేసిన ట్వీట్ భారతీయుల మనోభావాలను దెబ్బతీశాడు. ట్విట్టర్ మాజీ సీఈవో పరాగ్ అగర్వాల్‌ను కుక్క కన్నా హీనం అని అర్థం వచ్చేలా ట్విట్టర్ సీఈవో కుర్చీపై ఓ కుక్కను కూర్చోబెట్టి దాని మెడలో సీఈవో అని తగిలించి.. ఆ ఫోటోను తన ట్విట్టర్ ఖాతాలో షేర్‌ చేశాడు.. అయితే, ట్విట్టర్‌ చీఫ్‌ చేసిన ఈ పోస్ట్‌పై నెటిజన్లు మండిపడుతున్నారు.

ఎలాన్‌ మస్క్‌ ఈ తిక్క పనులు ఏంటి? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు.. ప్రపంచ కుబేరుడవు అయి ఉండవచ్చు. కానీ, అతనికి కనీస సంస్కారం లేదంటూ మండిపడుతున్నారు.. ట్విట్టర్ ఒప్పందం సందర్భంగా మాజీ సీఈవో పరాగ్ అగర్వాల్‌తో ఎలాన్ మస్క్ కు అనేక వివాదాలు తలెత్తిన విషయం విదితమే కాగా.. ఒక దశలో పరాగ్ అగర్వాల్.. మస్క్ ట్విట్టర్ డీల్ విజయవంతం కాకుండా అడ్డుకునేందుకు యత్నించారనే ఆరోపణలు కూడా వచ్చాయి.. అయితే, మస్క్ ట్విట్టర్ కొనుగోలు చేసిన వెంటనే, అప్పటి వరకు సీఈవోగా ఉన్న పరాగ్ అగర్వాల్‌ను తొలగించాడు.. అప్పట్లో దీనిపై పెద్ద దుమారమే రేగింది.. అయితే, మరోసారి దానిని గెలికే ప్రయత్నం చేశారు మస్క్.. తన పెంపుడు కుక్క ఫ్లోకి ఇప్పుడు మైక్రోబ్లాగింగ్ సైట్ యొక్క కొత్త సీఈవో అని ప్రకటించారు. Floki మునుపటి సీఈవో కంటే మెరుగైనది అంటూ ఆయన జోడించిన వికృత వ్యాఖ్య.. ఇప్పుడు చాలా మంది నెటిజన్లకు ఆగ్రహం తెప్పిస్తోంది..

ఫిబ్రవరి 15న తన వ్యక్తిగత ట్విట్టర్ ఖాతాకు వెళ్లినప్పుడు మస్క్ ట్విట్టర్‌లో తుఫాను సృష్టించాడు. షిబా ఇను, జపాన్‌కు చెందిన వేట కుక్కల జాతి.. ప్రపంచంలోని రెండవ అతిపెద్ద సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ యొక్క సీఈవో అంటూ పోస్ట్‌ చేశారు.. తన డెస్క్ వద్ద ఫ్లోకీ యొక్క చిత్రాన్ని పోస్ట్ చేశారు.. ఇది ట్విట్టర్ లోగోతో కూడిన కాగితం ముక్క, సంతకానికి బ్లాక్ స్పాట్, ఫ్లోకి పేరు మరియు “చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్” అనే టైటిల్‌ను చూపుతుంది. పరాగ్ అగర్వాల్ పేరును సూచించే “ఇతర వ్యక్తి” కంటే తన కుక్క Floki మెరుగైన సీఈవోగా చేస్తుందని కామెంట్‌ పెట్టడమే తాజా వివాదానికి కారణం అవుతోంది.. ఇక, ట్విట్టర్ సీఈఓ ఫ్లోకీ అద్దాలు ధరించి ఉన్న మరొక చిత్రాన్ని తీసి, “అతను సంఖ్యలతో గొప్పవాడు!” అని రాస్తూ మస్క్ నుండి హాస్యభరితమైన పోస్టింగ్ కొనసాగింది.