పిల్లలపై ప్రేమ… మొసలిపై పగ.. ఏనుగు ఏం చేసిందంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎంత లోకల్ అయినా.. ఒక్కోసారి నాన్ లోకల్ చేతిలో ఓడిపోవాల్సిందే అని నిరూపించే ఘటన ఇది. మొసలికి నీళ్లలో వెయ్యి ఏనుగుల బలం ఉంటుంది. అయితే అలాంటి మొసలిని దాని అడ్డాలోకే వెళ్లి.. ఓ ఏనుగు అంతు చూసింది. తన సంతానాన్ని కాపాడుకునేందుకు నీళ్లలో దిగి మొసలిని కాలితో తొక్కి చంపడం సంచలనంగా మారుతోంది. ఆఫ్రికాలోని సఫారీ పార్కులో జరిగిన ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఘటన జరిగి రెండునెలలు అవుతున్నా.. ఈ వీడియో మాత్రం వైరల్ అవుతూనే వుంది. పురాణాల్లో మొసలి చేతిలో చిక్కి గజరాజు ఆ విష్ణుమూర్తి సాయం కోరిన సంగతి అందరికీ తెలిసిందే. గజేంద్రమోక్షం గురించి అంతా చదివే వుంటాం. కానీ మనం ఇప్పుడు చదువుతున్నది మాత్రం మొసలి మరణం అనాలేమో. సాధారణంగా అడవుల్లో వుండే ఏనుగులు నీటి కోసం నదుల వైపునకు వెళతాయి.
Also Read
- Ukraine War: రష్యాపై ఉక్రెయిన్ అతిపెద్ద దాడి.. 1000కి పైగా డ్రోన్లతో కల్లోలం..
- Global Fuel Crisis: అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్‌లో రికార్డ్ స్థాయికి చేరిన డీజిల్, పెట్రోల్ ధరలు.. నెక్ట్స్ భారత్ వంతేనా?
- PIA Uniform Makeover: పాకిస్థాన్ ఎయిర్‌లైన్స్‌పై ట్రోలింగ్.. కొత్త యూనిఫామ్‌పై నెటిజన్ల ప్రశ్నలు..
- Iran-US Talks: అమెరికాతో చర్చలకు ఇరాన్ 7 షరతులు.. ట్రంప్ తిరస్కరిస్తే నిర్ణాయక యుద్ధానికి సిద్ధమంటూ హెచ్చరిక
నీళ్లు తాగడానికి తన పిల్లలతో కలిసి ఏనుగు నదిలోకి దిగింది. తన ప్లేస్‌లోకి వచ్చిన ఏనుగు పిల్లలను పట్టేందుకు ప్రయత్నించింది ఓ మొసలి. ఈ ప్లేస్ నాదే కదా.. ఇక్కడికి ఎవరైనా వస్తే ఓ పట్టుపట్టాల్సిందేనని భావించిన మొసలికి గర్వభంగం అయింది. ఏనుగు పిల్లలపై దాడిచేసిన మొసలికి ప్రాణభయం పట్టుకుంది. ఒక్కసారిగా మొసలిపై తల్లి ఏనుగు దాడి చేసింది. తన తొండం, కాలితో మొసలి ప్రయత్నం వర్కవుట్ కాలేదు.
తన బలమయిన పాదాలతో మొసలిని తొక్కి తొక్కి మరీ చంపేసింది. దీనిని అక్కడ ఉన్న కొందరు వీడియో తీశారు. తల్లి ఏనుగు మాత్రం మొసలి చచ్చిందని నిర్ధారించుకున్న తర్వాతనే బయటకు వచ్చింది. ఎంత లోకల్ అయినా అన్ని వేళలా అది వర్కవుట్ కాదు. పాపం మొసలి… తన అడ్డాలోనే మరణించక తప్పలేదంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
తాజావార్తలు
-
UP Politics: అఖిలేశ్ ముందే ఎస్పీ నేతల బూతులు.. రెండు జిల్లా కమిటీలు రద్దు
-
RVNL New Order: నవరత్న కంపెనీకి రూ. 404 కోట్ల రైల్వే ప్రాజెక్ట్.. సోమవారం ఈ షేర్లలో కదలికలు..
-
Khairatabad Ganesh : ఖైరతాబాద్‌లో గణపయ్య సందడి.. క్యూలైన్లన్నీ ఫుల్.!
-
BJP: ‘‘కాంగ్రెస్ జోకర్ల పార్టీ’’.. రాహుల్ గాంధీపై బీజేపీ ఫైర్..
-
The Paradise: అనిరుధ్ స్టూడియో నుంచి నాని ‘చిన్న లీక్’.. ‘ది ప్యారడైజ్’ 3rd సింగిల్‌పై క్రేజీ వీడియో వైరల్! చూశారా
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!