15 killed in Ecuador prison violence: లాటిన్ అమెరికా దేశం ఈక్వెడార్ లోని ఓ జైలులో ఖైదీల మధ్య తీవ్రఘర్షణ చెలరేగింది. ఈక్వెడార్ లోని లటాకుంగాలోని ఓ జైలులో ఖైదీల మధ్య ఘర్షణల కారణంగా 15 మంది ఖైదీలు మరణించారు. ఈ ఘర్షణల కారణంగా మరో 21 మంది గాయపడ్డారు. మాదకద్రవ్యాల రవాణా మార్గాలపై ముఠాల మధ్య ఘర్షణకు కారణమయ్యాయని అధ్యక్షుడు గిల్లెర్మో లాస్సో అన్నారు. ప్రస్తుతం అధికారులు మృతదేశాలను గుర్తించే పనిలో ఉన్నారు. ఇతర ప్రావిన్సుల్లో భద్రతను పెంచామని అధికారులు వెల్లడించారు. మరణించిన వారిలో 14 మంది శవాలను ఆస్పత్రికి తరలించారు.
Read Also: Loan app Harassment: లోన్ యాప్ వేధింపులకు ఐటీ ఉద్యోగి బలి.. రుణం చెల్లించినా ఆగని వేధింపులు
ఈ ఏడాది ఈక్వెడార్ లోని పలు జైళ్లలో జరిగిన ఘర్షణల కారణంగా 316 మంది ఖైదీలు మరణించారు. జూలైలో శాంటా డొమింగోలోని జైలులో ఇలాగే ఖైదీల మధ్య ఘర్షణలు తలెత్తాయి. దీంట్లో 13 మంది ఖైదీలు మరణించారు. మేలో ఇదే జైలులో జరిగిన హింసాత్మక దాడుల్లో 43 మంది మరణించారు. ఈక్వెడార్ జైలు వ్యవస్థను ప్రభుత్వం నిలిపివేయడంతో పాటు సమగ్ర విధానం లేకపోవడంతో ఖైదీలు అధ్వాన్న పరిస్థితులను ఎదుర్కొంటున్నారని ఇంటర్-అమెరికన్ కమీషన్ ఆన్ హ్యూమన్ రైట్స్ పేర్కొంది. అధికారిక గణాంకాల ప్రకారం.. ఈక్వెడార్ జైళ్లలో మొత్తం 33,500 మంది ఉన్నారని.. ఇది జైళ్ల గరిష్ట సామర్థ్యం కన్నా 11.3 శాతం అని పేర్కొంది.
లాటిన్ అమెరికాలోని పలు దేశాల మాదకద్రవ్యాల మాఫియా ముఠాలకు కేంద్రంగా ఉన్నాయి. మెక్సికో, ఈక్వెడార్, కొలంబియా, గ్వాటేమాల, ఎల్ సాల్విడార్, పూర్టోరికో, పెరూ వంటి దేశాల్లో డ్రగ్స్ ను ప్రపంచవ్యాప్తంగా సప్లై చేస్తున్నాయి. బ్రెజిల్ లోని అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ కొకైన్ డ్రగ్స్ ఉత్పత్తికి అడ్డాగా ఉంది. దక్షిణ అమెరికా దేశాల నుంచి యూఎస్ఏకు పెద్ద ఎత్తున మాదకద్రవ్యాల్ని సరఫరా చేస్తుంటారు స్మగ్లర్లు. ఎప్పటికప్పుడు అక్కడి ప్రభుత్వాలు ఈ డ్రగ్స్ ముఠాలను అరెస్ట్ చేస్తుంటారు. అయితే జైళ్లలో ఉన్న ఈ ముఠాల మధ్య ఆధిపత్య పోరు కారణంగా తరుచు హింసాత్మక సంఘటనలు జరుగుతుంటాయి. ఈ ఘటనల్లో ఖైదీలు మరణిస్తుంటారు.
