Site icon NTV Telugu

Earthquake: నేపాల్ లో మరో భూకంపం.. ప్రకంపనలతో వణికిన ఢిల్లీ..

Earthquake

Earthquake

Earthquake tremors felt across Delhi: నేపాల్ దేశంలో మరో భూకంపం వచ్చినట్లు తెలుస్తోంది. దీని ప్రకంపనలు దేశరాజధానితో పాటు హిమాలయ రాష్ట్రాల్లో కనిపించాయి. ఇటీవల కాలంలో హిమాలయాల్లో తరుచుగా భూకంపాలు సంభవిస్తున్నాయి. పరిశోధకులు కూడా త్వరలోనే హిమాలయాల్లో భారీ భూకంపం వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. శనివారం రాత్రి 8 గంటల ప్రాంతంలో ఢిల్లీతో పాటు పరిసర నగరాల్లో బలమైన భూప్రకంపనలు సంభవించాయి. చాలా మంది ఇళ్లు, ఆఫీసుల నుంచి బయటకు వచ్చారు. దాదాపుగా 5 సెకన్ల పాటు భూమి కంపించింది. నోయిడా, గురుగ్రామ్ లో కూడా ఇదే విధంగా ప్రకంపనలు కనిపించాయి.

Read Also: Warangal Crime: మద్యం మత్తులో కన్నకూతురిపై అఘాయిత్యం.. మనిషేనా..?

ఈ రోజు సాయంత్రం 7.57 గంటలకు నేపాల్ లో 5.4 తీవ్రతతో భూకంపం వచ్చింది. దీని ఫలితంగానే దేశంలోని ఢిల్లీ, ఉత్తరాఖండ్, హిమాలయ రాష్ట్రాల్లో ప్రకంపనలు ఏర్పడ్డాయి. భూకంప కేంద్ర భూమికి 10 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది.

దేశరాజధానిలో ఇలా ప్రకంపనలు రావడం ఇది వరసగా రెండో సారి. మంగళవారం నేపాల్ లో 6.3 తీవ్రతతో భూకంపం రావడంతో తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో ఢిల్లీలో బలమైన ప్రకంపనలు సంభవిచాయి. ఈ భూకంపం సుమారు 10 కిలోమీటర్ల లోతులో సంభవించింది. నేపాల్ లో ఆరుగురు మరణించగా.. ఎనిమిది మంది గాయపడ్డారు.

Exit mobile version