Earthquake: ఇజ్రాయెల్ దాడులతో సతమతమవుతున్న ఇరాన్‌లో మరోసారి భూకంపం సంభవించింది. సెమ్నాన్ ప్రాంతంలో 5.2 తీవ్రతతో భూమి కంపించింది. 10 కిలో మీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. అయితే, టెల్ అవీవ్‌తో ఉద్రిక్తతల వేళ టెహ్రాన్ రహస్యంగా అణు పరీక్షలు నిర్వహించడం వల్ల భూకంపానికి ఇది కారణం కావచ్చనే అనుమానాలు స్టార్ట్ అయ్యాయి. అంతరిక్ష, క్షిపణి కాంప్లెక్స్ ఉన్న నగరానికి సమీపంలోనే ఈ భూకంపం సంభవించింది.
Read Also: MP Mithun Reddy: జగన్‌కు వస్తున్న జనాదరణ చూసి జీర్ణించుకోలేక పోతున్నారు.. అందుకే..!
అయితే, ఇరాన్‌లోని సెమ్నాన్ ప్రావిన్సులోనే అంతరిక్ష కేంద్రంతో పాటు మిస్సైల్ కాంప్లెక్స్‌లు.. అక్కడి రక్షణశాఖ ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. వీటికి సమీపంలోనే తాజాగా భూకంపం వచ్చింది. బలమైన భూ ప్రకంపనలు ఉత్తర ఇరాన్‌లో అనేక ప్రాంతాలను తాకినట్లు తెలుస్తుంది. ఇక, దీని వల్ల ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, నష్ట తీవ్రత తక్కువగానే ఉందని తేలింది. కాగా, ప్రపంచంలో భూకంప ముప్పు అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఇరాన్ ఒకటి. అరేబియన్, యురేషియన్ టెక్టోనిక్ ప్లేట్లు కలిసే ఆల్పైన్-హిమాలయన్ సెస్మిక్ బెల్టు వెంబడి ఉండటంతో.. ఏడాదికి దాదాపు 2 వేలకుపైగా భూకంపాలు వస్తుంటాయి. ఇందులో 5 కంటే ఎక్కువ తీవ్రతతో వచ్చేవి సుమారు 15 నుంచి 16 వరకు ఉంటాయని లెక్కలు చెబుతున్నాయి. మొత్తంగా 2006-15 మధ్యకాలంగా ఇక్కడ 96 వేల భూకంపాలు వచ్చినట్లు తెలుస్తుంది.
