NTV Telugu Site icon

Dubai Princess: దుబాయ్‌ యువరాణి సంచలన ప్రకటన.. విడాకులు తీసుకుంటున్నట్లు వెల్లడి

Dubaiprincess

Dubaiprincess

మొహర్రం పండుగ రోజున దుబాయ్‌ యువరాణి షైకా మహ్రా మొహమ్మద్‌ రషీద్‌ అల్‌ మక్తూమ్‌ సంచలన నిర్ణయం తీసుకుంది. తన భర్త షేక్‌ మనా బిన్‌ మొహమ్మద్‌ అల్‌ మక్తూమ్‌తో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఆమె ఇన్‌స్ట్రాగామ్‌లో కీలకమైన నిర్ణయాన్ని వెల్లడించింది. ఇదిలా ఉంటే ఈ దంపతులకు మే 2, 2024న తొలి సంతానంగా ఆడ బిడ్డ జన్మించింది. ఆ సంతోషం ఎంతో కాలం లేకుండానే రెండు నెలలకే ఈ ప్రకటన రావడంతో తీవ్ర సంచలనం రేపుతోంది. సోషల్ మీడియాలో ఆమె పోస్టు చూసిన నెటిజన్లు ఆశ్చర్యానికి గురయ్యారు.