Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home International News Dubai Hypertower To Take Crown As World Tallest Residential Address

Burj Binghatti: UAE మరో గిన్నిస్ రికార్డ్.. ప్రపంచంలోనే ఎత్తైన భవనం

Published Date :November 24, 2022 , 1:50 pm
By NTV WebDesk
Burj Binghatti: UAE మరో గిన్నిస్ రికార్డ్.. ప్రపంచంలోనే ఎత్తైన భవనం
  • Follow Us :
  • google news
  • dailyhunt

Dubai Hypertower To Take Crown As World Tallest Residential Address: ఆకాశమే హద్దుగా ఎత్తైన భవనాలను నిర్మించడంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) కేరాఫ్ అడ్రస్. ఎవ్వరికీ సాధ్యం కాని సరికొత్త ఇంజినీరింగ్ ఆవిష్కరణలు, భవంతులతో.. యూఏఈ ఇప్పటివరకూ ఎన్నో ఘనతల్ని తన ఖాతాలో వేసుకుంది. ఇక బుర్జ్ ఖలీపా గురించి ప్రత్యేకంగా మెన్షన్ చేయాల్సిన అవసరమే లేదు. ప్రస్తుతానికి ప్రపంచంలో అదే అత్యంత ఎత్తైన భవనం. ఇప్పుడు యూఏఈ మరో సంచలనానికి తెరలేపేందుకు సిద్ధమవుతోంది. దుబాయ్‌లో అత్యంత ఎత్తైన నివాస భవనాన్ని నిర్మిస్తోంది. దుబాయ్‌ పరిధిలో ఆర్థిక ప్రాంతంగా పేరున్న ‘బిజినెజ్‌ బే’లో.. వంద ఫ్లోర్లతో ఒక హైపర్‌టవర్‌ని ఆవిష్కరించబోతోంది. దీంతో.. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన హైపర్‌టవర్‌గా ఇది గిన్నిస్ రికార్డ్ ఘనతని సొంతం చేసుకోబోతోంది.

అంతకుముందు ఈ రికార్డ్.. న్యూయార్క్‌ నగరంలోని మాన్‌హట్టన్‌ 57వ స్ట్రీట్‌లో సెంట్రల్‌ పార్క్‌ టవర్‌ పేరు మీద ఉండేది. ఆ భవనంలో 98 ఫ్లోర్స్‌ ఉన్నాయి. ఇప్పుడు దుబాయ్ హైపర్‌టవర్ అంతకంటే రెండు ఎక్కువ ఫోర్లతో కలిపి మొత్తం 472 మీటర్లతో ఎత్తుతో, దాని రికార్డ్‌ని బద్దలుకొట్టబోతోంది. కేవలం ఎత్తులోనే కాదు.. అత్యంత విలాసవంతమైన నివాస భవనంగానూ ఇది చరిత్రపుటలకెక్కబోతోంది. ఈ భవనాన్ని ఎమిరేటి ప్రాపర్టీ డెవలప్‌మెంట్‌ కంపెనీ ‘బింఘట్టి’, ప్రముఖ వాచ్‌మేకర్‌ కంపెనీ ‘జాకోబ్‌ అండ్‌ కో’ సంయుక్తంగా నిర్మించాయి. ప్రపంచ రికార్డు నెలకొల్పే ఉద్దేశంతోనే తాము ఈ హైపర్‌టవర్‌ను నిర్మిస్తున్నట్లు ఆ కంపెనీలు ప్రకటించాయి. ఆ రెండు సంస్థలు కలిసి ఈ నిర్మాణాన్ని చేపట్టాయి కాబట్టి.. తమ పేర్లతోనే ‘బుర్జ్‌ బింఘట్టి జాకోబ్‌ అండ్‌ కో రెసిడెన్సీ’గా దీనికి నామకరణం చేశారు.

Also Read

  • Iran War: ఇరాన్‌పై దాడికి అమెరికా సిద్ధం.. ట్రంప్ ముందు 3 ప్రణాళికలు..
  • Pakistan: ట్రంప్‌ను మోసం చేస్తున్న పాకిస్తాన్.. ఎలాగంటే..
  • Ajit Doval: ఢిల్లీలో ఇటలీ రక్షణ మంత్రి పర్యటన.. అజిత్ దోవల్‌తో సమావేశం
  • Trump-Putin: ట్రంప్-పుతిన్ మధ్య 90 నిమిషాలు కాల్ సంభాషణ.. ఏం చర్చించారంటే..!

ఈ భవనానికి ఉన్న మరో ప్రత్యేకత ఏమిటంటే.. దీని అగ్రభాగం డైమండ్ ఆకారంలో ఉంటుంది. అంతేకాదండోయ్.. రాత్రిపూట మిరుమిట్లు గొలిపే లైట్ల వెలుతురులో ఇది ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఇందులో డబుల్‌, త్రిబుల్‌ బెడ్‌ రూమ్‌లతో పాటు.. మరెన్నో ప్రత్యేకమైన సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నారు. చివరి ఐదు ఫ్లోర్‌లలో అత్యంత విలాసవంతమైన పెంట్‌హౌజ్‌లను సిద్ధం చేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే.. భూతల స్వర్గాన్ని తలపించేలా ఈ భవనం ఉండబోతోంది. అయితే.. ఈ భవనాన్ని ఎప్పుడు ప్రారంభిస్తారన్న విషయాన్ని ఇంకా ప్రకటించలేదు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • burj binghatti
  • burj binghatti jacob co residences
  • Dubai Hypertower
  • Tallest Residential Structure
  • UAE Tall Buildings

తాజావార్తలు

  • Salil Aarora: SRH కు మరో కాటేరమ్మ కొడుకు.. సలీల్ అరోరా ఎవరు..? చరిత్ర చూస్తే పూనకాలే..

  • DJ Sound: డీజే సౌండ్‌కు 140 కోళ్లు బలి.. కేసు నమోదు..

  • Rishabh Pant: టీమిండియాలో వికెట్ కీపర్ రేస్ హీట్.. రిషబ్ పంత్‌కు బిగ్ షాక్!

  • Tollywood Star Heroine: అవార్డులా? మాకొద్దు.. డబ్బుంటే పంపండి.. స్టార్ హీరోయిన్ తండ్రి సంచలనం!

  • Bhatti Vikramarka : ప్రజలకు ఇబ్బంది కలగకుండా విద్యుత్ సరఫరా చేయడమే ప్రభుత్వ లక్ష్యం

ట్రెండింగ్‌

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్‌ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions