Site icon NTV Telugu

Greta Thunberg: పర్యావరణ ఉద్యమకారిణి గ్రెటా థన్‌బర్గ్‌ ప్రయాణిస్తున్న నౌకపై డ్రోన్‌ దాడి

Greta Thunberg

Greta Thunberg

గాజాలో మానవతాసాయం అందించేందుకు 44 దేశాల పౌరులను తీసుకెళ్తున్న గ్రెటా థన్‌బర్గ్ నౌక్‌పై డ్రోన్ దాడి జరిగింది. ట్యునీషియా దగ్గర ఈ దాడి జరిగింది. పోర్చుగీస్ జెండా కలిగిన గ్లోబల్ సుముద్ ఫ్లోటిల్లా నౌక అనుమానిత దాడిలో దెబ్బతిన్నట్లుగా అధికారులు పేర్కొన్నారు. అయితే అందులో ఉన్న ప్రయాణికులు, సిబ్బంది అంతా సురక్షితంగా ఉన్నట్లు జీఎస్ఎఫ్ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోందని.. మరిన్ని వివరాలు త్వరలో తెలియజేస్తామని జీఎస్ఎఫ్ సంస్థ అధికారిక ప్రకటనలో పేర్కొంది.

ఇది కూడా చదవండి: Love Tragedy: వచ్చే జన్మలో అయినా నా బంగారు తల్లిని పెళ్లిచేసుకుంట.. ప్రియురాలి మృతిని తట్టుకోలేక ప్రియుడు..

నౌకపై డ్రోన్‌ దాడి జరిగిందనే వాదనలను ట్యునీషియా అధికారులు ఖండించారు. డ్రోన్‌ దాడికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవన్నారు. నౌక లోపలి నుంచే పేలుడు సంభవించిందని నేషనల్‌ గార్డ్‌ ప్రతినిధి వెల్లడించారు. ఇక నౌక దగ్గర గాజాకు మద్దతుగా ప్రజలు గుమిగూడి పాలస్తీనా జెండాలతో నినాదాలు చేశారు.

ఇది కూడా చదవండి: US-India: భారత్‌పై మరోసారి నోరు పారేసుకున్న ట్రంప్ సలహాదారు నవారో

Exit mobile version