కరోనా కేసులు తగ్గినట్టే తగ్గి తిరిగి విజృంభిస్తున్నాయి. 2020 మార్చి ఏప్రిల్ నెల వరకు అమెరికాలో కేసులు భారీగా నమోదయ్యాయి. ఆ తరువాత క్రమంగా తగ్గుముఖం పట్టిన సంగతి తెలిసిందే. కాగా ఇప్పుడు మరోసారి ఆ దేశంలో కేసులు పెరుగుతున్నాయి. గతంలో కంటే ఇప్పుడు మరింత వేగంగా వైరస్ వ్యాపిస్తోంది. రోజువారి కేసులు లక్ష వరకూ నమోదవుతున్నాయి. డెల్టా వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో అమెరికా సీడీసీ డైరెక్టర్ డాక్టర్ ఆంటోనీ ఫౌసీ ఆందోళన చెందుతున్నారు. డెల్టా వేరియంట్ మరింత ప్రమాదకారిగా మారి భవిష్యత్తులో ప్రస్తుతం ఉన్న వ్యాక్సిన్లను నుంచి తప్పించుకునే అవకాశం ఉందని, అదే జరిగితే ప్రపంచం అనేక ఇబ్బందులు పడే అవకాశం ఉందని అన్నారు. ఈ మహమ్మారి నుంచి బయటపడాలి అంటే తప్పని సరిగా డెల్టా వేరియంట్ ను కట్టడి చేయాలని అన్నారు. వైరస్ మరిన్ని మ్యూటేషన్లు జరగకుండా అడ్డుకోవాలని అన్నారు. గత నెల రోజుల వ్యవధిలో అమెరికాలో నమోదవుతున్న కేసుల్లో 350 శాతం పెరుగుదల ఉందని, ఇలానే కొనసాగితే రోజువారీ కేసులు రెండు మూడు లక్షల వరకూ నమోదయ్యే అవకాశం ఉంటుందని అన్నారు.
Read: ఆర్టిఫిషియల్ లెగ్ తో డాన్సింగ్ స్టార్!