Site icon NTV Telugu

Donald Trump: ‘‘ పరిస్థితి మరింత దిగజారుతుంది’’.. ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్..

Trump

Trump

Donald Trump: ఇరాన్‌పై ఇజ్రాయిల్ దాడుల గురించి తమకు ముందే సమాచారం ఉందని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. ఫాక్స్ న్యూస్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని చెప్పారు. ఇజ్రాయిల్ దాడుల్లో ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కమాండర్ హుస్సేన్ సలామీతో సహా అనేక మంది మరణించినట్లు వెల్లడించారు. ఇరాన్ తిరిగి చర్చల టేబుల్‌పైకి వస్తుందని తాను ఆశిస్తున్నట్లు చెప్పారు.

Read Also: Indian Coast Guard Recruitment 2025: 10th పాసైతే చాలు.. ఇండియన్ కోస్ట్ గార్డ్‌లో జాబ్స్ మీవే..

‘‘ఇరాన్ వద్ద అణుబాంబు ఉండదు. మేము చర్చల టేబుల్ కు తిరిగి రావాలని ఆశిస్తున్నాము. వారి నాయకత్వంలో చాలా మంది ఇక తిరిగి రారు’’ అని అన్నారు. తమ మిత్రదేశం ఇజ్రాయిల్ దాడులు చేసినప్పటికీ, అమెరికా ఇందులో పాల్గొనలేదని చెప్పారు. ఇప్పటికే గొప్ప విధ్వంసం జరిగిందని, తర్వాత ప్లాన్ చేసిన దాడులు మరింత తీవ్రంగా ఉంటాయని, ముగింపుకు రావడానికి ఇంకా సమయం ఉందని, ఏమీ మిగిలుండక ముందే ఇరాన్ ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోవాలని హెచ్చరించారు. ఇరాన్ సామ్రాజ్యంగా పిలువబడే దాన్ని కాపాడుకోవాలని ట్రంప్ తన సోషల్ మీడియా హ్యాండిల్‌లో రాశారు.

ఇరాన్‌ ఒప్పందం కుదుర్చుకోవడానికి అవకాశం ఇచ్చాము. కానీ వారు ఎంత ప్రయత్నించినా, ఎంత దగ్గరగా వచ్చినా ఒప్పందాన్ని కుదుర్చుకోలేకపోయారు. ప్రపంచంలో ఇప్పటి వరకు అమెరికా అత్యుత్తమ, ప్రాణాంతక ఆయుధాలను తయారు చేస్తో్ందని, ఇజ్రాయిల్ వద్ద కూడా అవి ఉన్నాయని, వాటిని ఎలా ఉపయోగించాలో వారి తెలుసని ఇరాన్ హెచ్చరించారు. రాబోయే దాడులు చాలా తీవ్రంగా ఉంటాయని ఇరాన్‌కి వార్నింగ్ ఇచ్చారు.

Exit mobile version