Donald Trump: అమెరికా అధ్యక్ష రేసు నుంచి జో బైడెన్ తప్పుకోవడంతో పాటు కమలా హారిస్ పోటీ చేయడంపై రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. బైడెన్ కంటే ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ను ఓడించడం సులభమని తాను భావిస్తున్నానని అన్నారు. జో బైడెన్ అధ్యక్షుడిగా పోటీ చేసే అర్హత లేదన్నారు.. యూఎస్ ప్రజలకు సేవ చేయడానికి అతడు అర్హత కాదని పేర్కొన్నారు.
Read Also: Release clash : మరోసారి మెగా vs అల్లు..ఈ సారి గెలుపెవరిది..?
ఇక, ‘దేశ చరిత్రలో చెత్త అధ్యక్షుడిగా జో బైడెన్ నిలిచిపోతాడని డొనాల్డ్ ట్రంప్ అభివర్ణించారు. అతడికి అధ్యక్షుడిగా ఉండటానికి హక్కు లేదు.. ప్రెసిడెంట్ పదవికి అర్హుడు కాదని వైద్యులు, మీడియాతో సహా ఆయన చుట్టూ ఉన్న వారందరికీ తెలుసు అని ఎద్దేవా చేశారు. అబద్ధాలు చెప్పి ఫేక్ న్యూస్ సృష్టించి అధ్యక్ష పదవిని సాధించుకున్నారు.. ఇక, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ డెమోక్రటిక్ పార్టీ ప్రెసిడెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగితే ఎన్నికల్లో ఆమెను ఓడించడం మాకు మరింత ఈజీ అని ట్రంప్ చెప్పుకొచ్చారు.
Read Also: Ujjaini Mahankali Bonalu: పచ్చి కుండపై నిలబడి రంగం .. దీని వెనుక ఉన్న మహత్యం..?
ఇక, నవంబర్ 5వ తేదీన జరిగే ఎన్నికల్లో 2025 నుంచి నాలుగేళ్ల కాలానికి యూఎస్ ప్రెసిడెంట్ ను ఎన్నుకోనున్నారు. అయితే, 1968 తర్వాత ఒక అమెరికా అధ్యక్షుడు మళ్లీ ఎన్నికల రేసు నుంచి దూరం కావడం ఇదే తొలిసారి. అంతకుముందు 1968లో అధ్యక్షుడు లిండన్ జాన్సన్ మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నారు. సెమ్ అలాంటి పరిస్థితి ప్రస్తుతం.. జో బైడెన్ ఎదుర్కొన్నారు.. అతడి ఆరోగ్యం సరిగా లేకపోవడంతో పాటు జ్ఞాపకశక్తి కోల్పోవడం వల్ల డెమోక్రటిక్ పార్టీ నుంచి తన అభ్యర్థిత్వాన్ని వదులుకోవాలని బైడెన్‌పై ఒత్తిడి పెరిగింది.