Trump: అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారానికి కొన్ని గంటల ముందు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వాషింగ్టన్ డీసీలో ఆదివారం నాడు జరిగిన మేక్ అమెరికా గ్రేట్ ఎగెయిన్ ర్యాలీని ఉద్దేశించి మాట్లాడు.. ఈ సందర్భంగా అమెరికాలోకి వలసలపై అతడు దూకుడుగా ఉన్నట్లు తెలిపాడు. తాను ప్రమాణస్వీకారం చేసిన వెంటనే దేశంలోని అక్రమ వలసదారుల దండయాత్ర నిలిచిపోనుందన్నారు. సరిహద్దుల నుంచి అక్రమంగా ప్రవేశించడాన్ని ఆపేస్తామన్నారు. ఇక, మన దేశ సంపదను మనమే అనుభవిస్తామని వెల్లడించారు. వలసలు వచ్చిన వారిని సాగనంపే కార్యక్రమం అమెరికా చరిత్రలో నిలిచిపోనుందని డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు.
Read Also: Israel – Hamas: ఇజ్రాయెల్- హమాస్ మధ్య కొనసాగుతున్న ఖైదీల విడుదల..
అయితే, ఎన్నికల సందర్భంగా ఇచ్చిన అన్ని హామీలన్నీ నెరవేరుస్తామని డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. టిక్‌టాక్ యాప్‌ను తిరిగి తీసుకొచ్చాం. మన ఉద్యోగాలు చైనాకు పోవొద్దు.. అందుకే టిక్‌టాక్ యాప్‌లో అమెరికా సర్కార్ 50 శాతం భాగస్వామ్యం తీసుకోబోతుందన్నారు. అధికారం చేపట్టక ముందే ట్రంప్ ఎఫెక్ట్‌తో ఇప్పటికే కొన్ని పనులు జరిగాయి.. ఇది నా ఎఫెక్ట్ కాదు.. మీ అందరి ఎఫెక్ట్ అని వెల్లడించారు. కాగా, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రెండోసారి ఘన విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్ ఈరోజు (జనవరి 20) ప్రమాణస్వీకారం చేయనున్నారు.