NTV Telugu Site icon

Donald Trump: రిపబ్లికన్‌ అధ్యక్ష అభ్యర్థిగా డొనాల్డ్ ట్రంప్‌.. వైస్ ప్రెసిడెంట్..?

Trump

Trump

Donald Trump: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థిగా డొనాల్డ్‌ ట్రంప్‌ను ఎంపిక చేశారు. సోమవారం మిల్వాకీలో జరిగిన పార్టీ జాతీయ సదస్సులో ప్రతినిధులందరూ కలిసి ఆయన అభ్యర్థిత్వానికి మద్దతు ఇచ్చారు. అదే టైంలో ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఒహాయో సెనేటర్‌ జెడీ వాన్స్‌ పేరును కూడా ట్రంప్‌ వెల్లడించారు. దీంతో నవంబరులో జరగబోయే ఎన్నికకు రిపబ్లికన్ పార్టీ తరఫున కీలక నేతల అభ్యర్థిత్వాలు ఇప్పటికే ఖరారైనట్లైంది. ఎంతో ఆలోచించి, అందరి యోగ్యతలను మదించిన తర్వాత ఉపాధ్యక్ష పదవికి వాన్స్‌ తగిన వ్యక్తి అని రిపబ్లికన్ పార్టీ నిర్ణయించిందని పేర్కొన్నారు.

Read Also: Bakhtiarpur Car Accident: బీహార్లో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి..!

కాగా, మెరైన్‌ విభాగంలో అమెరికాకు వాన్స్ సేవలందించారు అని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఒహాయో స్టేట్‌ యూనివర్సిటీ నుంచి పట్టభద్రుడైన ఆయన యేల్‌ లా విశ్వవిద్యాలయం పట్టభద్రుడు కూడా అని చెప్పుకొచ్చారు. యేల్‌ లా జర్నల్‌కు సంపాదకుడిగా ప్రస్తుతం కొనసాగుతున్నారు.. వాన్స్ రచించిన ‘హిల్‌బిల్లీ ఎలెజీ’ బుక్ అత్యధికంగా అమ్ముడు కావడంతో పాటు దీనిపై సినిమా కూడా తీశారు. సాంకేతికత, ఆర్థిక రంగాల్లో విజయవంతమైన వ్యాపారవేత్త వాన్స్ అని ట్రంప్‌ తన సామాజిక మాధ్యమం ట్రూత్‌ సోషల్‌లో వ్రాసుకొచ్చాడు. అయితే, 39 ఏళ్ల వాన్స్‌ 2022లో అమెరికా సెనేట్‌కు ఎంపికయ్యాడు. మొదట్లో ట్రంప్‌ విధానాలను విమర్శిస్తూ వచ్చిన.. ఆ తర్వాత అతడికి విధేయుడిగా మారిపోయారు.. డొనాల్డ్ ట్రంప్‌పై హత్యాయత్నం జరిగిన ఒక రోజు తర్వాత- రిపబ్లికన్‌ పార్టీ అధ్యక్ష, ఉపాధ్యక్ష అభ్యర్థులను ఖరారు చేసింది.