NTV Telugu Site icon

Netanyahu Meets Trump: డొనాల్డ్ ట్రంప్‌‌ను కలిసిన ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు

Trump

Trump

Netanyahu Meets Trump: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌‌ను ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు శుక్రవారం కలిశారు. ఫ్లోరిడాలోని ట్రంప్‌కు చెందిన మార్-ఎ- లాగో ఎస్టేట్‌లోని నివాసంలో ఈ ఇద్దరు భేటీ అయ్యారు. దీనికి సంబంధించిన వీడియోను నెతన్యాహు సోషల్ మీడియాలో పంచకున్నారు. అక్టోబరు 7వ తేదీన ఇజ్రాయెల్‌పై హమాస్ చేసిన ఘోరమైన ఉగ్రవాద దాడుల నేపథ్యంలో.. 2020 ఎన్నికల్లో తాను గెలిస్తే గాజాలో యుద్ధం జరిగేది కాదని డొనాల్డ్ ట్రంప్ చాలా సార్లు పేర్కొన్నారు.

Read Also: Encounter in Kupwara: జమ్మూకశ్మీర్‌లో మరోసారి కాల్పులు.. ఉగ్రవాది హతం, ముగ్గురు సైనికులకు గాయాలు..!

కాగా, ఈ భేటీలో వారి సంబంధాన్ని పునరుద్ధరించడానికి కట్టుబడాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ యుద్ధాన్ని తొందరగా ముగించాలని నెతన్యాహును డొనాల్డ్ ట్రంప్ కోరారు.. అలాగే, కమలా హారిస్‌ను ఇజ్రాయెల్ పట్ల స్నేహపూర్వకంగా లేని వ్యక్తిగా అతడు అభివర్ణించారు. ఈ ఇద్దరు నేతలు 2020లో కలిశారు. ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న టైంలో అమెరికా రాయబార కార్యాలయాన్ని జెరూసలేంకు మార్చడంతో ఇజ్రాయెల్ సార్వభౌమాధికారాన్ని గుర్తించి నెతన్యాహుకు ఆయన సపోర్ట్ ఇచ్చారు. ఇజ్రాయెల్- హమాస్ యుద్ధంపై పెరుగుతున్న ఒత్తిడి నేపథ్యంలో అమెరికాతో సంబంధాలను మరింత పెంచుకోవడానికి బెంజుమన్ నెతన్యాహు అక్కడ పర్యటిస్తూ.. వరుసగా దిగ్గజ నేతలను కలుస్తున్నారు.