NTV Telugu Site icon

Donald Trump Back On Twitter: ట్విట్టర్ లోకి ట్రంప్ రీఎంట్రీ.. రెండేళ్ల తరువాత సస్పెన్షన్ ఎత్తివేత

Donald Trump

Donald Trump

Donald Trump Back On Twitter: ట్విట్టర్ చరిత్రలో కీలక పరిణామం చోటు చేసుకుంది. డొనాల్డ్ ట్రంప్ రెండేళ్ల తరువాత ట్విట్టర్ లోకి అడుగుపెట్టారు. తాజాగా ట్రంప్ ట్విట్టర్ అకౌంట్ పునరుద్దరిస్తూ ఎలాన్ మస్క్ నిర్ణయం తీసుకున్నారు. శనివారం ట్రంప్ ట్విట్టర్ అకౌంట్ పునరుద్దరించాలా..? వద్దా..? అనేదానిపై పోల్ నిర్వహించారు. 51.8 శాతం మంది ట్రంప్ ట్విట్టర్ అకౌంట్ పునరుద్దరణకు మద్దతు తెలుపుతూ ఓట్ వేశారు. దీంతో మళ్లీ ట్రంప్ అకౌంట్ ట్విట్టర్ లో కనిపించింది.

Read Also: Kerala High Court: ముస్లిం చట్టం ప్రకారం మైనర్ పెళ్లి చేసుకోవచ్చా..? కేరళ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

ట్రంప్ కు ట్విట్టర్ లో 15 మిలియన్ల మంది ఓటింగ్ లో పాల్గొన్నారు. ఇందులో 51.8 శాతం మంది ట్రంపుకు మద్దతు పలికారు. 2021 అధ్యక్ష ఎన్నికల సమయంలో ట్రంప్ ఓటమి తర్వాత రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన కారణంగా జనవరి 6, 2021న యూఎస్ క్యాపిటల్ పై ట్రంప్ మద్దతుదారులు అల్లర్లకు పాల్పడ్డారని ట్విట్టర్ ఆరోపిస్తూ ట్రంప్ ఖాతాను బ్లాక్ చేసింది. దీంతో ఆయన కొత్తగా సొంతంగా ట్రూత్ సోషల్ అనే ప్లాట్‌ఫారమ్‌ ప్రారంభించారు. ఇటీవల ఎలాన్ మస్క్ ట్విట్టర్ సొంతం చేసుకున్న సమయంలో మస్క్ కూడా ట్రంపు అకౌంట్ పునరుద్దరణపై సానుకూల వ్యాఖ్యలు చేశారు. అయితే ట్రంప్ మళ్లీ ట్విట్టర్ లోకి వస్తారా..? అనేదానిపై పెద్దగా స్పష్టత ఇవ్వలేదు. తాజాగా నిషేధం ఎత్తివేయడంతో ట్రంప్ ట్విట్టర్ లోకి వచ్చారు.

‘‘వోక్స్ పాపులి, వోక్స్ డీ’’ అంటూ ఆదివారం లాటిన్ భాషలో ఎలాన్ మస్క్ ట్వీట్ చేశాడు. అంటే ‘‘ప్రజల నిర్ణయం దేవుడి నిర్ణయం’’ అని అర్థం. 237 ట్విట్టర్ యూజర్లలో 15 మిలియన్ల యూజర్లు ట్రంప్ పోలింగ్ లో ఓటేశారు. ట్విట్టర్ లో ట్రంప్ కు 88 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ట్విట్టర్ ను తన మౌత్ పీస్ గా ఉపయోగించారు ట్రంప్. తన మద్దతుదారులతో టచ్ లో ఉండేందుకు ట్విట్టర్ ను వాడారు.