NTV Telugu Site icon

Trump vs Harris debate: కమలా హారిస్‌తో డిబేట్కు డొనాల్డ్ ట్రంప్ గ్రీన్ సిగ్నల్..!

Kamala Harris

Kamala Harris

Trump vs Harris debate: డెమోక్రటిక్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్‌తో డిబేట్‌పై అమెరికా మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్‌ రియాక్ట్ అయ్యారు. కామ్రేడ్‌ కమలా హారిస్‌తో చర్చ కోసం రాడికల్‌ లెఫ్ట్‌ డెమోక్రాట్లతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఓ పోస్టు పెట్టారు. సెప్టెంబర్‌ 10వ తేదీన ఫిలడెల్పియాలో ఈ కార్యక్రమం జరగనుందని తెలియజేశారు ట్రంప్. ఈ సమావేశానికి నిర్దిష్ట షరతులు, నియమాలను అతడు వివరించారు.

Read Also: Srisailam Dam: శ్రీశైలం డ్యామ్‌కు భారీ వరద.. కాసేపట్లో గేట్లు ఎత్తనున్న అధికారులు..

కాగా, జూన్‌ 27వ తేదీన సీఎన్‌ఎన్‌లో అధ్యక్షుడు జో బైడెన్‌తో జరిగిన చర్చలో పాటించిన నియమాలను అనుసరించడానికి తాను, కమలా హారిస్‌ ఒప్పందానికి వచ్చినట్లు డొనాల్డ్ ట్రంప్‌ పేర్కొన్నాడు. ఇందులో ప్రత్యక్ష ప్రేక్షకులు ఉండరని చెప్పుకొచ్చారు. అభ్యర్థులు మాట్లాడినప్పుడు మైక్రోఫోన్లు మ్యూట్‌ చేసి ఉంటాయి అని వెల్లడించారు. ఇక, 2020 ఎన్నికల ఫలితాల తర్వాత జరిగిన హింస నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్‌పై వచ్చిన ఆరోపణలకు సంబంధించిన ఆరోపణలపై కొత్త అభియోగపత్రాన్ని ప్రత్యేక న్యాయవాది జాక్‌ స్మిత్‌ దాఖలు చేయగా.. ప్రధాన ఆరోపణలను అలాగే ఉంచారు.. ఇమ్యూనిటీపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు ప్రతి స్పందనగా కొన్ని అంశాలను డొనాల్డ్ ట్రంప్ ను వదిలి వేశారు.