Trump: రేపు ట్రంప్ 80వ బర్త్‌డే.. వైట్‌హౌస్‌లో ప్రత్యేక ఏర్పాట్లు

  • రేపు ట్రంప్ 80వ బర్త్‌డే
  • వైట్‌హౌస్‌లో ప్రత్యేక ఏర్పాట్లు
  • భారీగా ఖర్చు చేస్తున్నట్లుగా వార్తలు
Trump2

Trump2

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆదివారం 80వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు. అయితే ఈసారి బర్త్‌డే వేడుకలు స్పెషల్‌గా నిర్వహించేందుకు వైట్‌హౌస్ దగ్గర ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. జూన్ 14న నిర్వహించే రాత్రి ఈవెంట్‌కు దాదాపు రూ.500 కోట్లు ఖర్చు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

ఇక ట్రంప్ పుట్టినరోజును పురస్కరించుకుని వైట్‌హౌస్ దగ్గర అల్టిమేట్ ఫైటింగ్ ఛాంపియన్‌షిప్ ఫ్రీడమ్ 250 ఈవెంట్‌గా నిర్వహిస్తున్నారు. ఇందు కోసం సన్నాహాలు జరుగుతున్నాయి. పలు దేశాలకు చెందిన ఫైటర్లు ఇందులో పాల్గొననున్నారు. ఒకవైపు ట్రంప్ బర్త్‌డే వేడుకలు.. ఇంకోవైపు ఛాంపియన్‌షిప్ క్రీడలతో వైట్‌హౌస్ కళకళలాడుతోంది. ఈ వేడకను ‘‘అమెరికన్ పోరాట స్ఫూర్తికి తరంలో ఒక్కసారే వచ్చే వేడుక.’’ అని వైట్ హౌస్ అభివర్ణించింది. ఇక అమెరికా 250 స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఫ్రీడం 250 అని ఈవెంట్‌కు పేరు పెట్టారు.

×
×
Ad

గతేడాది రెండోసారి ట్రంప్ అధికారంలోకి వచ్చారు. అయితే ఈసారి చాలా దూకుడుగా వెళ్తున్నారు. రెండోసారి అధికారంలోకి రాగానే ప్రపంచ దేశాలపై వాణిజ్య యుద్ధాన్ని ప్రకటించారు. ఇక ఏడాది ప్రారంభంలో వెనిజులా అధ్యక్షుడు మదురోను కిడ్నాప్ చేయించారు. ఇక ఇరాన్‌పై యుద్ధం ప్రకటించారు. ప్రస్తుతం ఇరాన్‌తో శాంతి ఒప్పందం దిశగా ట్రంప్ వెళ్తున్నారు. ఇలాంటి తరుణంలో ట్రంప్ బర్త్‌డే సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. ఇక వచ్చే వారం ఫ్రాన్స్‌లో జరిగే జీ7 సదస్సుకు కూడా హాజరు కాబోతున్నారు.