Site icon NTV Telugu

Elon Musk: ట్రంప్ సర్కార్‌పై మస్క్ వ్యతిరేక గళం.. ట్యాక్స్‌ బిల్లుపై విమర్శలు

Musk

Musk

అమెరికా అధ్యక్షుడు ట్రంప్-ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ మధ్య విభేదాలు తలెత్తినట్లుగా తెలుస్తోంది. తాజాగా ట్రంప్ సర్కార్‌పై మస్క్ నిరసన గళం విప్పారు. ఇటీవల ట్రంప్ ప్రభుత్వం తీసుకొచ్చిన ట్యాక్స్ బిల్లుకు వ్యతిరేకంగా మస్క్ వ్యతిరేక గళం విప్పారు. ఇది చెడ్డ బిల్లు అని.. దీని కారణంగా అమెరికన్లపై అధిక భారం పడుతుందని విమర్శించారు.

ఇది కూడా చదవండి: Bollywood : మొత్తనికి అమీర్‌ఖాన్‌ కోసం దిగొచ్చిన OTT సంస్ధ..

ట్రంప్ సర్కార్ తీసుకొచ్చిన బిల్లును మస్క్ వ్యతిరేకిస్తూ ఎక్స్‌లో ట్వీట్ చేశారు. ‘‘నన్ను క్షమించండి. నేను ఇంతకంటే భరించలేను. ఇది అత్యంత దారుణమైనది. కాంగ్రెస్‌లో తీసుకొచ్చిన బిల్లు చాలా చెడ్డది. అది తప్పు అని మీకు తెలుసు. అయినా ఈ బిల్లుకు అనుకూలంగా ఓటు వేశారంటే అది మీకే అవమానం’’ అని రాసుకొచ్చారు. అమెరికా ద్రవ్యలోటు 2.5 బిలియన్‌ డాలర్లకు చేరుతుందని.. ఇలాగే కొనసాగితే అమెరికా దివాళా తీయడం ఖాయమనే మస్క్ అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఇది కూడా చదవండి: Virat Kohli: ఈ విజయం కోసం నా జీవితాన్ని దారపోశా.. చివరి వరకు ఆర్‌సీబీకే ఆడుతాను!

ఇక ఎలాన్ మస్క్‌ చేసిన ఆరోపణలను వైట్‌హౌస్‌ ఖండించింది. మస్క్ వ్యాఖ్యలతో ట్రంప్‌ అభిప్రాయాన్ని మార్చదని తేల్చిచెప్పింది. రానున్న బిల్లు గొప్పదని.. దానికి కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. మస్క్‌ చేసిన వ్యాఖ్యలు తనను నిరాశపరిచాయని హౌస్ స్పీకర్‌ మైక్‌ జాన్సన్‌ పేర్కొన్నారు.

శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో ట్రంప్ ఈ చట్టాన్ని ప్రశంసించారు. ఈ బిల్లు మీ లోటును తగ్గించే బిల్లు అని పేర్కొన్నారు. పన్నులతో పెద్ద కోతను తాను ఇష్టపడతానని చెప్పారు. ఈ విలేకర్ల సమావేశంలో అప్పుడు మస్క్ పక్కనే ఉన్నారు. కానీ అప్పుడు మస్క్ స్పందించలేదు. తాజాగా వ్యతిరేకంగా వ్యాఖ్యాలు చేశారు. ఇక ఈ బిల్లును రిపబ్లికన్లు కూడా వ్యతిరేకిస్తున్నారు. దీనిపై పునరాలోచన చేయాలని డిమాండ్ చేశారు.

 

Exit mobile version