Viral news: రెగ్యులర్ చెకప్ కి వెళ్ళాడు ఓ వృద్ధుడు. ఈ నేపథ్యంలో అతనికి కొలొనోస్కోపీ చేశారు వైద్యలు. అయితే ఆ కొలొనోస్కోపీ ప్రక్రియలో ఆ వృద్దుడి పెద్ద పేగులో ఈగను చూసి ఆశ్చర్య పోతున్నారు డాక్టర్లు. పైగా ఆ ఈగ చెక్కుచెరకుండా ఉండడం తో అసలు ఆ ఈగ పెద్ద పేగు లోకి ఎలా వెళ్లి ఉంటుందా..? అని అర్ధంకాక సతమతమౌతున్నారు శాస్త్రవేత్తలు. ఈ ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. అమెరికా లోని మిస్సౌరీలో ఓ 63 ఏళ్ల వృద్ధుడు రెగ్యులర్ చెకప్ కోసం ఆసుపత్రికి వెళ్లారు. ఈ నేపథ్యంలో అతనికి కొలొనోస్కోపీ చేసారు వైద్యులు. కాగా ఈ పరీక్షలో ఆ వృద్ధుడి పెద్దపేగులో ఈగను కనుగొన్నారు. ఈ విషయం ఆ వృద్దుడికి చెప్పగా అతను ఆశ్చర్య పోయాడు.
Read also:MLALaxmareddy: ప్రజా నాయకుడిని గెలిపించండి.. నియోజకవర్గ ప్రగతికి అడుగులు పడతాయి..
తాను ఆ ఈగను ఆహారంతో పాటుగా తీసుకున్నట్లు అతనికి తెలియదని చెప్పారు. అయితే ఆ ఈగ చనిపోయిన కూడా చెక్కుచెదరకుండా ఉంది. దీనితో అసలు ఆ ఈగ ఎలా కడుపు లోకి వెళ్లి ఉంటుందో డాక్టర్లకు, శాస్త్రవేత్తలకు అంతు పట్టడం లేదు. ఎందుకంటే నోటి ద్వారా వెళ్లి ఉంటె అది పొట్ట లోని ఆమ్లం కారణంగా జీరణమై ఉండాలి అలా జరగలేదు. ఈగ చెక్కుచెదరకుండా ఉంది. ఇక పురీష నాళం ద్వారా వెళ్లే అవకాశం లేదు ఎందుకంటే పెద్ద పేగు మడత బడి ఉంటుంది. కనుక కింద నుండి ఈగ వెళ్లే అవకాశం లేదు. దీనితో ఆ వృద్ధి పెద్ద పేగులోకి ఈగ ఎలా వెళ్లిందో తెలియక శాస్త్రవేత్తలు తలపట్టుకుంటున్నారు.