Site icon NTV Telugu

Trump-Greenland: ట్రంప్‌కు డెన్మార్క్ వార్నింగ్.. గ్రీన్‌ల్యాండ్ స్వాధీనం చేసుకుంటే..!

Greenland

Greenland

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చాలా దూకుడుగా వ్యవహరిస్తున్నారు. గత శనివారం వెనిజులాను స్వాధీనం చేసుకోగా.. ఇప్పుడు గ్రీన్‌ల్యాండ్‌పైన కన్నేశారు. ఇప్పటికే గ్రీన్‌ల్యాండ్‌ను స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించారు. ఆ దిశగా అమెరికా అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో డెన్మార్క్ ప్రభుత్వం.. ట్రంప్ ప్రభుత్వానికి గట్టి వార్నింగ్ ఇచ్చింది.

గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికా ఆక్రమించుకునే ప్రయత్నిస్తే డానిష్ సైనికులు మొదట కాల్పులు జరుపుతారని.. అటు తర్వాతే ప్రశ్నిస్తారని డెన్మార్క్ తెలిపింది. 1952 నాటి సైన్యం నియమ నిబంధనల ప్రకారం ఆ చర్య తీసుకోబడుతుందని డెన్మార్క్ వార్నింగ్ ఇచ్చింది. ప్రభుత్వ ఆదేశాలు లేకుండానే డానిష్ సైనికులు ఆక్రమణదారులపై దాడి చేస్తారని తెలిపింది.

ఇది కూడా చదవండి: Trump: ఆమె ప్రవర్తన దారుణంగా ఉంది.. ఇమ్మిగ్రేషన్ అధికారిని సమర్థించిన ట్రంప్

నాటో భూభాగం అయిన గ్రీన్‌ల్యాండ్‌ను స్వాధీనం చేసుకునేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పట్టుదలతో ఉన్నారు. వెనిజులాపై దాడి చేసినట్లుగా ఆర్కిటిక్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకోవాలనే ఆలోచనతో అమెరికా సైన్యం ప్రయత్నిస్తోంది. వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ మాట్లాడుతూ.. ‘‘గ్రీన్‌‌ల్యాండ్‌ను స్వాధీనం చేసుకోవడం అమెరికా జాతీయ భద్రతా ప్రాధాన్యత అని.. ఆర్కిటిక్ ప్రాంతంలో ప్రత్యర్థులను అరికట్టడం చాలా ముఖ్యమని అధ్యక్షుడు అందరికీ తెలియజేశారు. ఈ ముఖ్యమైన విదేశాంగ విధాన లక్ష్యాన్ని సాధించడానికి అధ్యక్షుడు, ఆయన బృందం చర్చిస్తున్నారు.’’ అని పేర్కొంది. ఇక అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో వచ్చే వారం డానిష్, గ్రీన్‌ల్యాండ్ అధికారులను కలవాలని యోచిస్తున్నట్లు కరోలిన్ లీవిట్ చెప్పారు.

జేడీ వాన్స్..
గ్రీన్‌ల్యాండ్‌ను భద్రపరచడంలో డెన్మార్క్ ప్రభుత్వం స్పష్టంగా సరైన పని చేయలేదని ఆరోపించారు. ‘‘ఆర్కిటిక్‌లో అమెరికా ప్రయోజనాలను కాపాడుకోవడానికి ట్రంప్ ఎంత దూరం వెళ్లడానికైనా సిద్ధంగా ఉన్నారు.’’ అని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ అన్నారు.

ఇది కూడా చదవండి: Off The Record: ఆ హీరోను చూసి టీడీపీ నేతలు బయపడిపోతున్నారా..?

Exit mobile version