Declining population in China: చైనాలో 2022లో తక్కువ జనాభాను నమోదు చేస్తుందని జనాభా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. 1961లో మహా కరువు తర్వాత 2022లో తొలిసారిగా చైనాలో జనాభా తగ్గదల కనిపించింది. 2022లో చైనాలో కొత్త జననాల రేటు రికార్డు స్థాయిలో పడిపోయింది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే.. 2022లో శిశువుల జననాలు 10 మిలియన్ల కన్నా తక్కువగా నమోదు అయ్యాయి. అంతకుముందు ఏడాది 10.6 మిలియన్ల శిశువులు జన్మించారు. 2020తో పోలిస్తే 11.5 శాతం తక్కువగా జననాలు నమోదు అయ్యాయి.
కొన్ని దశాబ్ధాల కాలంగా చైనాలో జనాభా తగ్గుదల తొలిసారిగా నమోదు అవుతుందని కాలిఫోర్నియా యూనివర్సిటీ సోషియాలజీ ప్రొఫెసర్ వాంగ్ ఫెంగ్ అన్నారు. 80 ఏళ్ల లోపు జనాాభా చైనాలో 45 శాతం తగ్గుతుందని అంచనా. 2021లో చైనా మొత్త జనాభా 141.12 కోట్లకు చేరుకుంది. అదే సమయంలో జనాభాలో చైనాను ఇండియా క్రాస్ చేస్తుందని అంచానా వేశారు. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన 10 దేశాల్లో సంతానోత్పత్తి క్షీణిస్తోంది. అయితే చైనాలో 2022 సంతానోత్పత్తి రేటు అత్యల్పంగా 1.18గా ఉంది.
Read Also: Dog Attack Child: బాలిక పై వీధి కుక్కుల దాడి.. పరిస్థితి విషమం
జనాభా పెరుగుదలను అదుపు చేసేందుకు 1980-2015 వరకు ఒకే బిడ్డ విధానాన్ని పాటించింది. అయితే గతేడాది జనాభా తిరోగమనంలో ఉందని చైనా కమ్యూనిస్ట్ పార్టీ అధికారికంగా అంగీకరించింది. చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ 2025 కంటే ముందే జనాభా క్షీణించడం ప్రారంభం కావచ్చని అంచనా వేసింది. దేశంలో జననాల రేటును పెంచేందుకు అధ్యక్షుడ జి జిన్ పింగ్ మరిన్ని విధానలు అమలు చేస్తామని వెల్లడించారు. 2021 నుంచి చైనా అధికారులు పన్ను మినహాయింపులు, ఎక్కువ కాలం ప్రసూతి సెలవులు, మెరుగైన వైద్య బీమా, గృహ రాయితీలు ప్రకటించి ప్రజలు మరింత మంది పిల్లలను కనేలా ప్రోత్సహిస్తున్నారు.
ఇదిలా ఉంటే కోవిడ్ నియంత్రించాలని నిర్భంధంగా లాక్ డైన్లను, జీరో కోవిడ్ విధానాన్ని అనుసరించింది చైనా. దీంతో చైనాలో పారిశ్రామిక ఉత్పత్తి తగ్గింది. దీంతో ప్రజల ఆదాయాలు కూడా తగ్గుతూ వచ్చాయి. దీంతో ఈ ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో చైనీయులు పిల్లలను కనేందుకు మొగ్గు చూపడం లేదు. అక్కడ కొత్తగా పెళ్లి చేసుకున్న వారు ఆర్థిక పరిస్థితుల వల్ల పిల్లలను పోషించలేమని చెబుతున్నారు.
