Site icon NTV Telugu

Flesh-Eating Bacteria: యూఎస్ఏలో పెరుగుతున్న “మాంసం తినే బ్యాక్టీరియా”..

Flesh Eating Bacteria

Flesh Eating Bacteria

Flesh-Eating Bacteria: అమెరికా తీర ప్రాంత ప్రజలను ఇప్పుడో కొత్తరకం బ్యాక్టీరియా కలవరపెడుతోంది. అత్యంత ప్రాణాంతకం అయిన బ్యాక్టీరియా ‘‘ విబ్రియో వల్నిఫికస్’’ కారణంగా అంటువ్యాధులు పెరుగుతున్నాయి. దీన్ని సాధారణంగా ‘‘మాంసాన్ని తినే బ్యాక్టీరియా’’గా పిలుస్తుంటారు. యూఎస్ తీరం చుట్టూ వేడెక్కుతున్న జలాలు ఈ బ్యాక్టీరియా పెరుగుదలకు కారణం అవుతున్నాయి. క్రమంగా తీరం వెంబడి కదులుతున్నాయి.

యునైటెడ్ స్టేట్స్ యొక్క డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ సెంటర్స్ ప్రకారం, విబ్రియో వల్నిఫికస్, ప్రాణాంతక గాయం ఇన్ఫెక్షన్లకు కారణమవుతుంది. విబ్రియో వల్నిఫికస్ ఇన్ఫెక్షన్ ఉన్న చాలా మందికి ఇంటెన్సివ్ కేర్ అవసరం ఏర్పడటంతో పాటు చాలా సందర్భాల్లో బ్యాక్టీరియా సోకిన కాలు, లేదా చేతి ప్రాంతాన్ని తొలగింపుకు కారణం అవువతోంది. ఈ ఇన్ఫెక్షన్ సోకిన 5 మందిలో ఒకరు మరణిస్తున్నారు. కొన్నిసార్లు అనారోగ్యం పాలైన ఒకటి రెండు రోజుల్లోనే చనిపోవడం కలవరపరుస్తోంది.

Read Also: Karnataka Elections: తొలివిడతగా అభ్యర్థుల జాబితాను ప్రకటించిన బీజేపీ.. 52 మంది కొత్తవారికి అవకాశం..

కొన్ని విబ్రియో వల్నిఫికస్ ఇన్‌ఫెక్షన్‌లు నెక్రోటైజింగ్ ఫాసిటిస్‌కు దారితీస్తాయి, దీనిలో ఒక గాయం చుట్టూ ఉన్న మాంసం చనిపోతుంది. దీని వల్లే ఈ బ్యాక్టీరియాకు ‘‘మాంసాన్ని తినే బ్యాక్టీరియా’’గా పేరొచ్చింది. అయితే ఈ రకమైన నెక్రోటైజింగ్ ఫాసిటిస్ కు ఒకటి కంటే ఎక్కువ బ్యాక్టీరియా కారణం సంభవించవచ్చు.

1988 మరియు 2016 మధ్య జర్నల్ సైంటిఫిక్ రిపోర్ట్స్‌లో ప్రచురించబడిన ఒక అధ్యయనాన్ని ఉటంకిస్తూ.. ది మెట్రో ఒక కథనం ప్రకారం, యూఎస్ఏలో 1,100 కంటె ఎక్కువ గాయాలు ఇన్ఫెక్షన్లు నమోదెు అయ్యాయి. వీటిలో 159 మంది మరణించారు. 2041-2060 మధ్యకాలంలో విబ్రియో వల్నిఫికస్ న్యూజెర్సీ నుంచి న్యూయార్క్ వరకు వ్యాపిస్తుంది. దీంతో ఏటా కేసుల సంఖ్య రెట్టింపు అయ్యే అవకాశం ఉంది. వాతావరణ మార్పులకు సమాజం స్పందించే తీరుపై కూడా బ్యాక్టీరియా పెరుగుదల ఆధారపడి ఉంటుంది. మరింగా నీరు వేడెక్కితే కోస్తా తీరానికి మరో 1000 కిలోమీటర్ల దూరంలో ఉత్తరాన ఉన్న మైనే వరకు అంటువ్యాధులు సంభవించవచ్చు.

Exit mobile version