Site icon NTV Telugu

Epstein files: ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో 169 సార్లు దలైలామా పేరు..

Dalai Lama

Dalai Lama

Epstein files: టిబెటన్ ఆధ్యాత్మిక నాయకుడు, ప్రముఖ బౌద్ధ గురువు దలైలామా పేరు ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో ఉందనే వార్తలు గుప్పుమంటున్నాయి. ప్రపంచవ్యాప్తంగా పలు మీడియా సంస్థలు దీనిని నివేదించాయి. అయితే, ఈ మీడియా నివేదికల్ని దలైలామా ఆఫీస్ తీవ్రంగా ఖండించింది. లైంగిక నేరస్తుడు జెఫ్రీ ఎప్‌స్టీన్ మైనర్ బాలికల సె*క్స్ కుంభకోణానికి సంబంధించిన ఫైళ్లను అమెరికన్ న్యాయశాఖ విడుదల చేసింది. ఈ ఫైళ్లలో దలైలామా పేరు 169 సార్లు కనిపించిందని పలు మీడియా సంస్థలు నివేదించాయి. మల్టిపుల్ ఈమెయిళ్లలో, మసాజ్ ఫర్ డమ్మీస్ పుస్తకంలో ఆయన పేరు ఉందనే ఆరోపణలు వచ్చాయి.

Read Also: Tata EV Cars Discount: టాటా ఈవీ కార్లు కొనేవారికి గుడ్న్యూస్.. ఏకంగా రూ. 3.8 లక్షల వరకు తగ్గింపు

ఈ నివేదికలనను దలైలామా ఆఫీస్ తీవ్రంగా ఖండించింది. ‘‘దలైలామా ఎప్పుడూ కూడా ఎప్‌స్టీన్‌ను కలవలేదు’’ అని చెప్పింది. కొన్ని నివేదికలు అక్టోబర్ 2012 నాటి ఈమెయిళ్లను ప్రస్తావించాయి. వీటిలో దలైలామా, ఎప్‌స్టీన్ మధ్య సమావేశం జరిగిందని సూచించే సూచనలు ఉన్నాయని తెలిపాయి. ఇదే కాకుండా దలైలామా అనుచరులగా పేర్కొంటున్న కొంతమంది వ్యక్తులు ఎప్‌స్టీన్‌ను కలిసి ఉండొచ్చని యూరోపియన్ మీడియా సంస్థ నెక్ట్సా టీవీ పేర్కొంది.

ఇటీవల అమెరికా న్యాయశాఖ ఎప్‌స్టీన్ ఫైళ్లకు సంబంధించి మూడు మిలియన్లకు పైగా పైళ్లు, 2000కి పైగా వీడియోలు, సుమారు 1.8 లక్షల ఫోటోలను రిలీజ్ చేసింది. ఈ పత్రాల్లో అమెరికాకు చెందిన ప్రముఖులు, వ్యాపారవేత్తలు ఉన్నారు. వీరితో పాటు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపుపొందిన వారు కూడా ఉన్నారు. డొనాల్డ్ ట్రంప్, బిల్ క్లింటన్, బిల్ గేట్స్, ఎలాన్ మస్క్ వంటి ప్రముఖులు ఉన్నారు.

Exit mobile version