Mars: అంగారకుడిపై నీటి ఆనవాళ్లు.. క్యూరియాసిటీ రోవర్ అద్భుత ఆవిష్కరణ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Curiosity Rover Makes A Stunning New Discovery: సౌరవ్యవస్థలో భూమి తరువాత మానవుడు నివసించే అవకాశాల ఉన్న గ్రహంగా అంగారకుడిని భావిస్తున్నారు. ఇప్పటికే అక్కడ పరిశోధనలు చేయడానికి నాసాతో పాటు మరికొన్ని దేశాల స్పేస్ ఏజెన్సీలు అరుణగ్రహంపై రోవర్లను పంపించాయి. వీటిలో గ్రహ ఉపరితలం, నీటి ఆనవాళ్ల గురించి పరిశోధనలు జరుపుతున్నాయి. ఇప్పటికే పలు అధ్యయనాలు మార్స్ పై ఒకప్పుడు విస్తారంగా నీరు ఉండేదని తేలింది. అయితే తాజాగా నాసాకు చెందిన క్యూరియాసిటీ రోవర్ మరో అద్భుత ఆవిష్కరణ చేసింది. ఒకప్పుడు అంగారకుడిపై సరస్సులు ఉండేవనే ఆధారాలను కనుగొంది. క్యూరియాసిటీ అలల వంటి రాతి నమూనాలను కనుగొంది.

Also Read
- Kathmandu: రన్‌వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?
- Viral Road Accident: అరె బాబు.. బైకును అక్కడ ఎలా పార్క్ చేశావయ్యా.!
- Pakistan Terror Attack: పాలు పోసి పెంచిన పామే కాటేసింది.. పాకిస్థాన్‌లో ఉగ్రదాడి!
- Hantavirus Outbreak: హంటావైరస్ కలకలం.. లక్షణాలు, చికిత్సపై WHO కీలక హెచ్చరిక.. కొత్త మహమ్మారిగా మారుతుందా..?
Read Also: Mallikarjun Kharge: దేశంలో వాక్ స్వాతంత్య్రం లేదు.. బీజేపీపై ఖర్గే మండిపాటు
ప్రస్తుతం క్యూరియాసిటీ రోవర్ అంగారకుడిపై గేల్ బిలంలో ఉన్న మౌంట్ షార్ప్ ప్రాంతంలో ఉంది. ఇక్కడే మిలియన్ సంవత్సరా క్రితం సరస్సు ఉండేదని అందుకు అధారంగా కాలక్రమేణా సరస్సు మిగిల్చిన గ్రానైట్ ఆలల అల్లికలను కనుగొంది. నాసా దాదాపుగా దశాబ్ధం కింద క్యూరియాసిటీ రోవర్ ను పంపింది. రెండేళ్ల క్రితం పర్సువరెన్స్ అనే మరో రోవర్ ను విజయవంతంగా మార్స్ పైకి చేర్చింది నాసా.
ఒకప్పుడు నదులు, సముద్రాలతో అంగారక గ్రహం, భూమిని పోలి ఉండేది. ఇప్పటికే అక్కడ ధృవాల వద్ద గడ్డకట్టిన స్థితిలో నీరు ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అయితే భూమితో పోలిస్తే అంగారకుడి పరిమాణం చిన్నగా ఉండటంతో పాటు శక్తివంతమైన అయస్కాంత క్షేత్రం లేకపోవడం వల్ల సూర్యుడి నుంచి వచ్చే రేడియేషన్ కారణంగా నీరు అంతరించిపోయినట్లు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అంగారకుడి అంతర్భాగంలో కోర్ కాలక్రమంలో మాగ్నిటిక్ ఫీల్డ్ ను జనరేట్ చేయకపోవడం వల్లే ఇదంతా జరిగిందని సైంటిస్టులు భావిస్తున్నారు.
తాజావార్తలు
-
Rajinikanth-Kamal Haasan: రజనీ-కమల్ మెగా మల్టీస్టారర్‌లో త్రిష..
-
8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, యాక్టివ్ కూలింగ్‌తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!
-
Drishyam3 : దృశ్యం -3 తెలుగు రీమేక్ నుండి తప్పుకున్న వెంకీ.. డబ్బింగ్ వర్షన్ రిలీజ్ కు రెడీ
-
Tim David: ఎందుకు బ్రో అంత కోపం.. RCB విజయంతో టిమ్ డేవిడ్ ఆ వేళ్లు చూపిస్తూ.!
-
Trisha: త్రిషను ‘పరాన్నజీవి’తో పోల్చుతూ..సింగర్ సుచిత్ర సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..
-
Kathmandu: రన్‌వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?
-
Viral Road Accident: అరె బాబు.. బైకును అక్కడ ఎలా పార్క్ చేశావయ్యా.!
-
Forbes Survey: ఆఫీస్ ‘ప్రేమాయణం’.. 40 శాతం మంది తమ భాగస్వామిని మోసం చేస్తున్నారట! షాకింగ్ గణాంకాలు
-
Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత