Site icon NTV Telugu

తాలిబ‌న్‌లు కీల‌క ప్ర‌క‌ట‌న‌: రాజ‌ధాని కాబూల్‌లో క‌ర్ఫ్యూ విధింపు…

అనుకున్న‌ట్టుగానే మ‌రోసారి ఆఫ్ఘ‌నిస్తాన్ తాలిబ‌న్ల ఆదీనంలోకి వెళ్లింది.  ప్ర‌స్తుతం అక్క‌డి ప‌రిస్థితులు దారుణంగా మారిపోయాయి.  తాలిబ‌న్లు ఇప్ప‌టికే ష‌రియా చ‌ట్టాల‌ను అమ‌లులోకి తెచ్చిన‌ట్టుగా సోష‌ల్ మీడియాలో వార్త‌లు వ‌స్తున్నాయి.  త‌ప్పు చేసిన వారికి ష‌రియా చ‌ట్టం ప్ర‌కారం శిక్ష‌లు విధిస్తుంటారు.  ఈ చ‌ట్టాలు మ‌రింత క‌ఠినంగా ఉంటాయి.  20 ఏళ్లుగా కాస్తో కూస్తో అభివృద్ధి సాధించింది ఆఫ్ఘ‌నిస్తాన్‌.  ఇప్పుడు మ‌రోసారి తాలిబ‌న్ల ఆక్ర‌మ‌ణ‌లో ఎన్నేళ్లు వెన‌క్కి వెళ్లిపోతుందో చెప్ప‌డం క‌ష్ట‌మే.  కాబూల్ లో ప‌రిస్థితులు ఘోరంగా మారాయి.  వీలైనంత వ‌ర‌కు దేశం వ‌దిలి వెళ్లేందుకు ప్ర‌జ‌లు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.  కాబూల్ ఎయిర్ పోర్ట్ కిక్కిరిసి పోవ‌డం, అమెరికా ఎయిర్‌పోర్ట్‌ను త‌మ ఆదీనంలోకి తీసుకోవ‌డంతో నిన్న‌టి రోజుల కొద్దిపాటి కాల్పులు జ‌రిగాయి.  సివిల్ ఏవియేష‌న్ ను నిలిపివేస్తు ఇప్ప‌టికే ఆదేశాలు జారీ అయ్యాయి.  కాగా, ఇప్పుడు తాలిబ‌న్లు మ‌రో నిర్ణ‌యం తీసుకున్నారు.  ఈ గంద‌ర‌గోళ ప‌రిస్థితులు చ‌ల్లారాలంటే క‌ర్ఫ్యూ విధించాల‌ని నిర్ణ‌యం తీసుకున్నాయి.  దీంతో కాబూల్ న‌గ‌రంలో క‌ర్ఫ్యూ విధించారు.  అధికారికంగా క‌ర్ఫ్యూ విధించ‌డంతో రోడ్ల‌న్ని ఖాళీగా మారిపోతున్నాయి.  

Read: అమెరికా అద్య‌క్షుడు కీల‌క ప్ర‌క‌ట‌న‌: అది మా ల‌క్ష్యం కాదు…

Exit mobile version