అమెరికా అద్య‌క్షుడు కీల‌క ప్ర‌క‌ట‌న‌: అది మా ల‌క్ష్యం కాదు…

ఆఫ్ఘ‌నిస్తాన్ నుంచి అమెరికా, నాటో ద‌ళాలు త‌ప్పుకోవ‌డంతో ఆ దేశంలో ప‌రిస్థితులు ఒక్క‌సారిగా మారిపోయాయి.  సెప్టెంబ‌ర్ 11 వ‌ర‌కు పూర్తిగా ఆఫ్ఘ‌నిస్తాన్ నుంచి త‌ప్పుకోవాల‌ని నిర్ణ‌యం తీసుకున్నా, ఆ ప్ర‌క్రియ‌ను అమెరికా వేగ‌వంతం చేయ‌డంతో తాలిబ‌న్లు దురాక్ర‌మ‌ణ‌కు పాల్ప‌డ్డాయి.  వేగంగా ఆ దేశాన్ని ఆక్ర‌మించుకున్నాయి.  ఆదివారంరోజున రాజ‌ధాని కాబూల్ న‌గ‌రంలోకి ప్ర‌వేశించ‌డంతో ఆఫ్ఘ‌న్ తాలిబ‌న్ల వ‌శం అయింది.  ఈ ప‌రిస్థితికి అమెరికానే కార‌ణం అని ప్ర‌పంచం మొత్తం విమ‌ర్శ‌లు చేస్తున్న త‌రుణంలో అమెరికా అధ్య‌క్షుడు జో బైడెన్ జాతిని ఉద్దేశించి ప్ర‌సంగించారు.  

Read: ఆఫ్ఘ‌నిస్థాన్‌ కొత్త ప్రెసిడెంట్ ఈయ‌నే..|

ఆఫ్ఘ‌న్ పరిస్థితుల‌కు తాము కార‌ణం కాద‌ని, ఆఫ్ఘ‌నిస్తాన్‌కు తాము స‌హాయం అందించామ‌ని, కాని త‌మ స‌హ‌కారాన్ని ఆ దేశ సైనికులు స‌రిగా వినియోగించుకోలేక‌పోయార‌ని అన్నారు.  అమెరికా సైన్యానిని తీవ్ర‌మైన న‌ష్టం జ‌రిదింద‌ని, ఆఫ్ఘ‌నిస్తాన్ నిర్మాణం త‌మ ల‌క్ష్యం కాద‌ని, అమెరికా భ‌ద్ర‌తే త‌మ‌ల‌కు ముఖ్య‌మ‌ని, అమెరికా భ‌ద్ర‌త‌కోసం త‌గిన విధంగా నిర్ణ‌యాలు తీసుకుంటామ‌ని అన్నారు.  త‌మ ముందు రెండు ల‌క్ష్యాలు ఉన్నాయ‌ని, ఒక‌టి అమెరికా ద‌ళాల‌ను ఆఫ్ఘ‌న్ నుంచి వెనక్కి ర‌ప్పించ‌డం లేదా మ‌రిన్ని ద‌ళాల‌ను పంపి మూడో ద‌శాబ్ధంలో కూడా యుద్ధం చేయ‌డం.  అమెరికాకు ఏది మంచిదో అదే చేశామ‌ని అన్నారు.  అమెరికాపై ఉగ్ర‌దాడుల‌ను నిరోదించ‌డ‌మే త‌మ ల‌క్ష్యం అని ఆయ‌న పేర్కొన్నారు.  

-Advertisement-అమెరికా అద్య‌క్షుడు కీల‌క ప్ర‌క‌ట‌న‌: అది మా ల‌క్ష్యం కాదు...

Related Articles

Latest Articles