Site icon NTV Telugu

Saudi Arabia: సౌదీ యువరాజు ఓ సైకో.. పలు దేశాలకు ముప్పులా పరిణమించాడు!

Saudi Arabia Prince

Saudi Arabia Prince

అగ్ర రాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ మరికొద్ది రోజుల్లో సౌదీ అరేబియాకు వెళ్లనున్న నేపథ్యంలో సంచలన ఘటన చోటుచేసుకుంది. సౌదీ అరేబియాకు చెందిన మాజీ ఇంటెలిజెన్స్ అధికారి సాద్ అల్‌జాబ్రి యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్‌పై సంచలన ఆరోపణలు చేశారు. సౌదీ యువరాజు ఓ సైకో అని తెలిపారు. ఆ మాజీ అధికారి ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయం తెరపైకి వచ్చింది. ఆ మాజీ అధికారి చేసిన వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా పెను దుమారానికి దారి తీశాయి. సాద్ అల్‌జాబ్రి సౌదీ ఇంటెలిజెన్స్‌లో ఉన్నత హోదాలో పనిచేశారు.

మహ్మద్ బిన్ సల్మాన్‌కు అపార సంపదలు ఉండడంతో, అమెరికాతో పాటు ఇతర దేశాలకు ఓ ముప్పులా పరిణమించాడని అల్ జాబ్రి అన్నారు. కిరాయి సైనికులతో ‘టైగర్ స్క్వాడ్’ అనే దళాన్ని కూడా నడుపుతున్నాడని తెలిపాడు. ఈ యువరాజు లెక్కలేనన్ని వనరులున్న ఓ హంతకుడు అని పేర్కొన్నారు. ఈ దళం ప్రత్యేకంగా కిడ్నాపులు, హత్యలు చేస్తుందని ఆరోపించాడు.ఏమాత్రం దయాదాక్షిణ్యాలు లేని ఓ ఉన్మాది అని మహ్మద్ బిన్ సల్మాన్‌ను అభివర్ణించారు.భావోద్వేగాలు లేని కఠినాత్ముడు అని, గతానుభవాల నుంచి ఏమాత్రం నేర్చుకోని మూర్ఖుడు అని సాద్ అల్ జాబ్రి వివరించారు. అతడి హత్యలకు, నేరాలకు తామే సాక్షులమని వెల్లడించారు.

Ranil Wickremesinghe:ఉన్న ఒక్క ఇంటినీ కాల్చేశారు.. శ్రీలంక ప్రధాని తీవ్ర ఆవేదన

అల్ జాబ్రి అప్పట్లో మహ్మద్ బిన్ నయేఫ్‌కు సలహాదారుడిగా కూడా ఉన్నాడు. కాగా మహ్మద్ బిన్ నయేఫ్‌ను 2017లో సౌదీ యువరాజు పీఠం నుంచి దించివేశారు.ఆ తర్వాత మహ్మద్ బిన్ సల్మాన్ యువరాజు అయ్యారు. ఇదిలా ఉండగా.. అల్ జాబ్రి వ్యాఖ్యలను అమెరికాలోని సౌదీ అరేబియా రాయబార కార్యాలయం కొట్టిపడేసింది. తన ఆర్థిక నేరాలను కప్పిపుచ్చుకోవడానికే ఇలాంటి కామెంట్స్‌ చేశాడని స్పష్టం చేసింది.

Exit mobile version