Site icon NTV Telugu

COVID-19 Alert: వామ్మో మళ్లీ విజృంభిస్తున్న కరోనా..

Covid

Covid

COVID-19 Alert: ప్రపంచ దేశాలను వణికించిన కరోనా మహమ్మారి లక్షలాది మంది ప్రాణాలను బలి తీసుకుంది. సకాలంలో వ్యాక్సిన్లు అందుబాటులోకి రావడంతో ప్రపంచ దేశాలు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నాయి. లేకుంటే మరింత ప్రాణ నష్టం జరిగేది. అయితే, తాజాగా అగ్రరాజ్యం అమెరికాలో కరోనా వైరస్ మరోసారి విజృంభిస్తుండటం కలకలం రేపుతుంది. గత కొన్ని రోజులుగా యూఎస్ లో కోవిడ్ బారిన పడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరిగిపోతుంది. ప్రస్తుతం అమెరికాలో సమ్మర్ కావడంతో, సెలవులను ఎంజాయ్ చేసేందుకు పెద్ద ఎత్తున ప్రయాణాలు చేస్తున్నారు ప్రజలు. తీర ప్రాంతాలు, టూరిస్టు ప్రదేశాలకు తరలిపోవడంతో ఈ వైరస్ మరింత వేగంగా వ్యాపిస్తోందని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ తెలియజేసింది.

Read Also: HHVM : నైజాం సొంత రిలీజ్ కాదు.. రంగంలోకి ‘’అమెరికా సుబ్బారావు’’

ఇక, ఒహియో, ఫ్లోరిడా, కాలిఫోర్నియా, టెక్సాస్ లాంటి రాష్ట్రాల్లో కరోనా కేసుల సంఖ్య అధికంగా ఉందని అధికారులు తెలిపారు. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ నివేదిక ప్రకారం.. NB.1.8.1, XFG అనే కొత్త వేరియంట్లు ప్రస్తుతం అమెరికాలో వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. ఈ కొత్త వేరియంట్ల ప్రభావంతో గొంతు నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, గుండె బరువుగా ఉండటం లాంటి లక్షణాలు అధికంగా కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి ప్రజలు అలర్ట్ గా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఏమైనా అనుమానిత లక్షణాలు కనిపిస్తే వెంటనే కరోనా పరీక్షలు చేసుకోవాలని సూచించారు. అలా చేయడం వల్ల వైరస్ వ్యాప్తిని త్వరగా నియంత్రించవచ్చన్నారు. ప్రజలు వ్యక్తిగత పరిశుభ్రతను పాటించడంతో పాటు రద్దీ ప్రదేశాలకు వెళ్తే మాస్కులు ధరించాలని చెప్పుకొచ్చారు. అలాగే, సామాజిక దూరాన్ని కూడా ప్రజలు పాటించాలని వైద్యాధికారులు కోరుతున్నారు.

Exit mobile version