NTV Telugu Site icon

IMEEC: ఇండియా-మిడిల్ ఈస్ట్-యూరప్ ఎకనామిక్ కారిడార్‌పై ఇజ్రాయిల్-హమాస్ యుద్ధం ప్రభావం చూపిస్తుందా..?

Imecc

Imecc

IMEEC: ఇజ్రాయిల్‌పై హమాస్ ఉగ్రవాదుల దాడి యుద్ధానికి దారి తీసింది. ముందు హమాస్ మొదలు పెడితే, ఇప్పుడు ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్ పాలస్తీనా గాజా ప్రాంతంలోని హమాస్ స్థావరాలే లక్ష్యంగా దాడులు చేస్తోంది. ఈ యుద్ధం రెండు కీలక ఒప్పందాలను ప్రభావితం చేస్తోంది. ఇజ్రాయిల్-అమెరికా-సౌదీ అరేబియా మధ్య ఒప్పందాన్ని ప్రభావితం చేసింది. అరబ్ దేశాలతో ఇజ్రాయిల్ మధ్య సత్సంబంధాలు ఏర్పాటు చేయాలనే అమెరికా లక్ష్యాన్ని ఈ యుద్ధం దెబ్బతీసింది. ప్రస్తుతానికి ఈ ఒప్పందానికి సౌదీ బ్రేక్ వేసింది.

ఇదిలా ఉంటే మరో కీలక ప్రాజెక్టు అయిన ఇండియా-మిడిల్ ఈస్ట్-యూరప్ ఎకనామిక్ కారిడార్(IMECC)ఈ యుద్ధం పెద్ద అవాంతరాన్ని ఏర్పరిచింది. ఇటీవల భారత్ నిర్వహించిన జీ20 సదస్సులో సౌదీ, యూఏఈ, ఇండియా, అమెరికా వంటి దేశాలు ఈ ఎకనామిక్ కారిడార్ పై చర్చించాయి. ఇందులో ఇజ్రాయిల్ కూడా కీలక పాత్ర పోషిస్తోంది. అయితే గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్(GTRI) సహవ్యవస్థాపకుడు అజయ్ శ్రీ వాస్తవ మాట్లాడుతూ.. యుద్ధం ఈ ప్రభావితం చేయవచ్చని అన్నారు.

Read Also: Heat Wave: ప్రమాదం ముంగిట భారత్, పాక్ 220 కోట్ల మంది.. ఘోరమైన వేడితో ముప్పు..

ఈ యుద్ధం ప్రాంతీయంగా పరిమితమైనప్పటికీ.. ఇది భౌగోళిక రాజకీయాలను ప్రభావితం చేయొచ్చని ఆయన తెలిపారు. IMEEC ప్రాజెక్టు భారత్, గల్ఫ్, మిడిల్ ఈస్ట్, యూరప్ దేశాలను భారీ నౌకా ప్రాజెక్టులు, రైల్వే ప్రాజెక్టులతో అనుసంధానిస్తుంది. ఈ ప్రాజెక్టు యూఏఈ, సౌదీ అరేబియా, జోర్డాన్, ఇజ్రాయిల్, గ్రీస్ గుండా యూరప్ ని అనుసంధానిస్తుంది.

భారత్, యూఏఈ, అమెరికా, సౌదీ, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, యూరోపియన్ యూనియన్ వంటి ప్రభుత్వాల భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్టుపై అవగాహన ఒప్పందం(ఎంఓయూ) కుదిరింది. వీటిపై ఆయా దేశాలు సంతకం చేశాయి. యూరప్, ఆసియాల మధ్య రవాణా, కమ్యూనికేషన్ లింక్ ని మెరుగుపరచడంతో పాటు చైనా యొక్క బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ కి కౌంటర్ గా ఈ ప్రాజెక్టులు చేపట్టాయి. ప్రస్తుత ఇజ్రాయిల్-పాలస్తీనా సంక్షోభం ఈ ప్రాజెక్టును ఆలస్యం చేసే అవకాశం ఉంది.