CIA Cyber Attack: CIAపై భారీ సైబర్ దాడి.. అమెరికా నిఘా వ్యవస్థలో కలకలం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CIA Cyber Attack: అమెరికా అత్యంత కీలకమైన నిఘా సంస్థ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (CIA)పై భారీ సైబర్ దాడి జరిగినట్లు సమాచారం. గుర్తుతెలియని హ్యాకర్లు CIAకు చెందిన కీలకమైన ఇంటెలిజెన్స్ డేటాబేస్‌లోకి చొరబడినట్లు సమాచారం. ఈ ఘటన అమెరికా భద్రతా వ్యవస్థలో తీవ్ర ఆందోళనకు దారితీసింది. న్యూయార్క్ టైమ్స్ నివేదిక ప్రకారం.. హ్యాకర్లు చొరబడిన వ్యవస్థలో సోషల్ మీడియా, శాటిలైట్ చిత్రాలు, ఇతర బహిరంగంగా అందుబాటులో ఉన్న వనరుల నుంచి సేకరించిన సమాచారాన్ని భద్రపరిచి విశ్లేషించేవారు.
ఈ వ్యవస్థను CIAతో పాటు అమెరికా నిఘా సంస్థలు ప్రపంచవ్యాప్తంగా సంభవించే పొటెన్షియల్ ముప్పులను గుర్తించడానికి, కీలక సమాచారాన్ని సేకరించడానికి ఉపయోగించేవి. ఈ సైబర్ దాడి ప్రభావం ఆఫీస్ ఆఫ్ ది డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ (ODNI)పైనా పడినట్లు సమాచారం. ఈ దాడికి పాల్పడింది ఎవరు? ఏ దేశానికి చెందిన హ్యాకర్లు ఈ పని చేశారు? అనే విషయాలు ఇప్పటివరకు వెల్లడికాలేదు. హ్యాకర్లు అసలు వ్యవస్థలోకి ఎలా ప్రవేశించారనే వివరాలు కూడా తెలియరాలేదు.
Also Read
- Sheikh Hasina: భారత్ నుంచి స్వదేశానికి హసీనా.. సంకెళ్లతో తీసుకొస్తామన్న బంగ్లాదేశ్ మంత్రి!
- UAE: యూఏఈలో బస్సు-ట్రక్కు ఢీ.. 13 మంది మృతి, మృతుల్లో భారతీయులు!
- Sheikh Hasina: ‘‘అప్పగింత’’ ద్వారానే రావాలి.. షేక్ హసీనా రాకపై బంగ్లాదేశ్ యూటర్న్!
- Russia Nuclear Satellite: అంతరిక్షంలో రష్యా అణుబాంబు.. న్యూక్లియర్ శాటిలైట్‌పై ఆందోళన.!
ఇటీవలి కాలంలో అమెరికాలోని కీలక ప్రభుత్వ సంస్థలు వరుసగా సైబర్ దాడులకు గురవుతున్నాయి. అమెరికా వ్యవసాయ శాఖలోనూ సైబర్ చొరబాటు జరిగినట్లు వార్తలు వచ్చాయి. అంతేకాకుండా FBIలో రెండు వేర్వేరు సైబర్ చొరబాటు ఘటనలు వెలుగులోకి వచ్చాయి. పెంటగాన్, అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగాలు కూడా ఇటీవల సైబర్ సంబంధిత ఘటనలతో ప్రభావితమైనట్లు సమాచారం.
కొద్ది రోజుల క్రితం హ్యాకర్లు FBIకి చెందిన నేషనల్ క్రైమ్ ఇన్ఫర్మేషన్ సెంటర్ (NCIC) డేటాబేస్‌ను లక్ష్యంగా చేసుకున్నారు. అమెరికాలోని ఫెడరల్, రాష్ట్ర, ప్రాంతీయ స్థాయి చట్ట అమలు సంస్థల మధ్య నేరాలకు సంబంధించిన సమాచారాన్ని బదిలీ చేయడానికి ఈ డేటాబేస్ ఉపయోగపడుతుంది. NCICపై ఇది రెండో సైబర్ దాడిగా పేర్కొంటున్నారు. కొన్ని నెలల క్రితం కూడా FBI వ్యవస్థపై హ్యాకర్లు దాడి చేసినట్లు సమాచారం.
ఇదిలా ఉండగా, ఇటీవల మైక్రోసాఫ్ట్ భారీ సాంకేతిక అంతరాయాన్ని ఎదుర్కొంది. ఈ కారణంగా దాదాపు 36 గంటల పాటు పలు సేవలు నిలిచిపోయినట్లు సమాచారం. Outlook, Teams సహా అనేక Office యాప్‌లను వినియోగదారులు ఉపయోగించలేకపోయారు. అమెరికాలోని CIA, FBI వంటి అత్యంత కీలకమైన భద్రతా సంస్థలతో పాటు ఇతర ప్రభుత్వ విభాగాలు కూడా సైబర్ ముప్పులను ఎదుర్కొంటుండటం ఆందోళన కలిగిస్తోంది. దేశ భద్రతకు సంబంధించిన కీలక సమాచారాన్ని రక్షించుకోవడం అమెరికా నిఘా వ్యవస్థకు ఇప్పుడు పెద్ద సవాలుగా మారింది.
తాజావార్తలు
-
CIA Cyber Attack: CIAపై భారీ సైబర్ దాడి.. అమెరికా నిఘా వ్యవస్థలో కలకలం!
-
Phule: 200 ఏళ్ల నాటి పోరాటంతో నవంబర్ 27న థియేటర్లలోకి ‘ఫూలే’!
-
Sharwanand : “డింపుల్.. లవ్ యూ !.. ఆ ఎనర్జీ ఏంటి?”: ‘భోగి’ స్టేజ్‌పై శర్వానంద్ ఓపెన్ కామెంట్స్.
-
Story Board: దేవదీపావళిగా ప్రసిద్ధి చెందిన కార్తీక పౌర్ణమి! కార్తీక పౌర్ణమి విశిష్టత ఏంటి?
-
Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో కార్తీక పౌర్ణమి శోభ.. అరుణాచలేశ్వరుని కల్యాణం, జ్వాలాతోరణం!
ట్రెండింగ్
-
6.58mm స్లిమ్ డిజైన్, 50MP కెమెరా, 6500mAh బ్యాటరీతో Huawei Mate 90 Air లాంచ్..!
-
2TB స్టోరేజ్, 8000 నిట్స్ బ్రైట్నెస్, 6200mAh బ్యాటరీతో Huawei Mate X8 లాంచ్..!
-
టీ20ల్లో చరిత్ర సృష్టించిన Priyansh Arya.. 68 బంతుల్లో 181 పరుగులు..! క్రిస్ గేల్ రికార్డ్ బద్దలు..
-
రూ.83 వేల ప్రారంభ ధరతో ఐదు వేరియంట్లతో లాంచ్.. Suzuki Access 125 స్కూటర్లో కొత్త కలర్స్..!
-
501.7cc ఇంజిన్, మూడు వేరియంట్లు.. రెట్రో లుక్‌తో Honda CB500 బైక్..!