South China Sea: దక్షిణ చైనా సముద్ర విషయంలో సరిహద్దు దేశాలను చైనా తన బలాన్ని చూసుకుని కవ్విస్తోంది. ఫిలిప్పీన్స్, వియత్నాం దేశాలను బెదిరించేందుకు ప్రయత్నిస్తోంది. దురాక్రమణవాదంతో భయపెడుతోంది. ఇదిలా ఉంటే తాజాగా దక్షిణ చైనా సముద్రంలో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. ఫిలిప్పీన్స్ దేశానికి చెందిన శాస్త్రవేత్తల నౌకను చైనా కోస్టుగార్డు అడ్డగించింది. దీంతో కొన్ని గంటల పాలు ఈ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పాడ్డాయి. ఫిలిప్పీన్స్ ప్రభుత్వానికి చెందిన నౌక సముద్రంలోని ఇసుక దిబ్బలపై పరిశోధన చేసేందుకు వెళ్తున్న సమయంలో, తమ నౌకకు దగ్గరగా వచ్చి చైనా అడ్డుకునే ప్రయత్నం చేసిందని ఫిలిప్పీన్స్ ప్రతినిధి తెలిపారు. అయితే, యథావిధిగా చైనా తన తప్పేంలేదని ఖండించింది.
ఇదిలా ఉంటే, దక్షిణ చైనా సముద్ర జలాల్లో ఉండే ఇసుక దిబ్బలపై 34 మంది ఫిలిప్పీన్స్ దేశస్థులు చట్టవిరుద్ధం కార్యకలాపాలకు పాల్పడుతున్నారని, వారిని అక్కడ నుంచి వెళ్లిపోవాని పలుమార్లు హెచ్చరించామని చైనా కోస్టుగార్డు చెబుతోంది. చైనా అధికారి గాన్ యూ చేసిన వ్యాఖ్యల్ని ఫిలిప్పీన్స్ ఖండించింది. చైనా కోస్టుగార్డు అబద్ధాలను ప్రచారం చేస్తోందని, సుమారు 4గంటల పాలు మా నౌక సమీపానికి వచ్చి హారన్ మోగిస్తూ, సైనిక హెలికాప్టర్‌తో తమను కవ్వించే ప్రయత్నం చేసిందని, తమ పరిశోధన బృందాన్ని అడ్డుకుందని ఫిలిప్పీన్స్ కోస్టుగార్డు ప్రతినిధి జైటర్రీలా తెలిపారు.
Read Also: Biju Menon: ఈ విలన్ భార్య హీరోయిన్.. ఎంత అందంగా ఉందో చూశారా?
దక్షిణ చైనా సముద్ర జలాలపై హక్కుల కోసం చైనా, మలేషియా, వియత్నాం, తైవాన్, బ్రూనై, మలేషియా, ఫిలిప్పీన్స్‌లు ప్రయత్నిస్తున్నాయి. సముద్రజలాలపై అధికారాన్ని ప్రతీ దేశం క్లెయిమ్ చేస్తుంది. అయితే, చైనాతో పోలిస్తే మిగతావి ఆర్ధికంగా, సైనికంగా చిన్న దేశాలు కావడంతో వాటిని డ్రాగన్ కంట్రీ బెదిరిస్తోంది. చైనా ఈ సముద్ర ప్రాంతాలపై ఆధిపత్యాన్ని సాధించేందుకు దక్షిణ చైనా సముద్రంలోని 25 ద్వీపాలకు పేర్లు పెట్టింది.
గతేడాది నుంచి ఈ సముద్రం జలాల్లో ఫిలిప్పీన్స్-చైనా మధ్య వివాదం ముదురుతోంది. ఈ నెల మొదట్లో రెండు దేశాల కోస్టుగార్డు నౌకలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఫిలిప్పీన్స్‌కి చెందిన నౌక స్వల్పంగా దెబ్బతింది. వరస ఘటనల నేపథ్యంలో అమెరికా ఫిలిప్పీన్స్‌కి మద్దతు తెలిపింది. ఆ దేశ సైనికులు, విమానాలు, నౌకలు దాడి చేస్తే చైనాను సహించేంది లేదని హెచ్చరించింది.
