NTV Telugu Site icon

India-China: నెహ్రూ విధానాలపై చైనా అధ్యక్షుడి ప్రశంసలు

Chinea

Chinea

చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ నోట శాంతిసందేశం ఆశ్చర్యం కలిగించింది. విదేశీ విధానానికి సంబంధించి భారత్‌ తీసుకొచ్చిన పంచశీల ఒప్పందం మెరుగైందని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ అన్నారు. ఈ సందర్భంగా భారత మాజీ ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ విధానాలపై ఆయన ప్రశంసలు కురిపించారు. భారత్‌ – చైనా మధ్య కుదిరిన ‘పంచశీల ఒప్పందాని’కి 70 ఏళ్లు పూర్తయిన సందర్భంగా బీజింగ్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిన్‌పింగ్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

ఇది కూడా చదవండి: Viral News : ఓరి దేవుడా.. 3 రోజుల్లో 60 మందిని పెళ్లి చేసుకున్న మహిళ

ఇరు దేశాల మధ్య సరిహద్దు వివాదానికి సంబంధించి భారత్‌తో ప్రతిష్టంభన కొనసాగుతున్న వేళ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ప్రపంచంలో నెలకొన్న ఘర్షణలకు ముగింపు పలకడానికి పంచశీల సూత్రాలు మెరుగ్గా పని చేస్తాయని చెప్పుకొచ్చారు. శాంతి, అభివృద్ధికి ఈ ఐదు సూత్రాలు సమాధానమిస్తాయని తెలిపారు. చైనా-భారత్‌, చైనా-మయన్మార్‌తో సంయుక్త ప్రకటనల్లోనూ ఈ సూత్రాలను గత నాయకత్వం కూడా చేర్చిందని గుర్తుచేశారు. దేశాల మధ్య బలమైన సంబంధాలకు వీటిని ప్రాథమిక నిబంధనలుగా చేర్చాలని సంయుక్తంగా పిలుపునిచ్చిందఅని జిన్‌పింగ్‌ గుర్తుచేశారు.

ఇది కూడా చదవండి: TEA: మీరు ఉదయాన్నే ఖాళీ కడుపుతో టీ తాగుతున్నారా? ప్రమాదంలో పడ్డట్టే!

పొరుగు దేశాలకు సంబంధించి ఒకరి ఆంతరంగిక వ్యవహారాల్లో మరొకరు జోక్యం చేసుకోకూడదనే ఉద్దేశంతో భారత్‌ – చైనా మధ్య ఈ ఒప్పందం కుదిరింది. 1954లో ఇరు దేశాల అప్పటి ప్రధానులు జవహర్‌లాల్‌ నెహ్రూ, చౌ-ఎన్‌లై దీనిపై సంతకాలు చేశారు. 1960లో నెహ్రూ ప్రారంభించిన అలీనోద్యమంతో ఈ విధానాలు ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందాయి.