Site icon NTV Telugu

ఢీకొట్టాల‌ని ప్ర‌య‌త్నిస్తే…మెడ‌లు తెంచుతాం…

చైనాలో కమ్యునిస్టు పార్టీ ఆవిర్భ‌వించి వందేళ్లు పూర్తైన సంద‌ర్బంగా బీజింగ్‌లోని తీయాన్మెన్ స్క్వేర్‌లో భారీ స‌భ‌ను నిర్వ‌హించారు.  ఈ స‌భ‌కు 70 వేల‌మంది చైనీయులు హాజ‌ర‌య్యారు.  వీరిని ఉద్దేశించి చైనా అధ్య‌క్షుడు జీజిన్‌పింగ్ ప్ర‌సంగించారు.  ప్ర‌పంచంలో చైనా ఒక బ‌ల‌మైన శ‌క్తిగా ఆవిర్భవించింద‌ని, చైనాను ఇప్పుడు ఎవ‌రూ వేధించినా వారి సంగ‌తి చూస్తామ‌ని జిన్‌పింగ్ తెలిపారు.  తైవాన్ విష‌యంలో త‌మ నిర్ణ‌యం ఎప్ప‌టికీ ఒకేలా ఉంటుంద‌ని, తైవాన్‌ను విలీనం చేసుకొని తీర‌తామ‌ని జిన్‌పింగ్ పేర్కొన్నారు.  

Read: “అద్భుతం”గా తేజ సజ్జా, శివాజీ రాజశేఖర్ ఫస్ట్ లుక్

చైనా దేశాన్ని తక్కువ‌గా అంచ‌నా వేయ‌వ‌ద్ద‌ని, చైనాతో త‌ల‌ప‌డాల‌ని చూస్తే 140 కోట్ల చైనీయులు సృష్టించిన గ్రేట్ చైనా వాల్ ఆఫ్ స్టీల్‌ను ఢీకొని వారి త‌ల‌లై బ‌ద్ద‌ల‌వుతాయ‌ని అన్నారు.  సోష‌లిజానికి ప్ర‌తీక చైనా అని, చైనా ల‌క్ష‌ణాల‌ను సోష‌లిజానికి జోడించి దేశాన్ని అభివృద్ది చేస్తామ‌ని జిన్‌పింగ్ తెలిపారు. 70 వేల మంది ఈ స‌భ‌లో పాల్గొన్నారు.  అయితే, ఈ స‌భ‌కు హాజ‌రైన వ్యక్తులు ఎవ‌రూ కూడా మాస్క్ ధ‌రించ‌క‌పోవ‌డం విషేషం.  

Exit mobile version