NTV Telugu Site icon

China Covid: చైనాకు ఊరట.. కరోనా కేసులు, మరణాలు తగ్గుముఖం

China Corona Virus

China Corona Virus

China says Covid deaths down by nearly 80 percent: ఇంతకాలం కరోనా దెబ్బకు అతలాకుతలమైన చైనాకు ఇప్పుడు కాస్త ఊరట లభించింది. ఆ దేశంలో కరోనా కేసులతో పాటు మరణాల సంఖ్య తగ్గుముఖం పట్టాయి. జనవరి మొదట్లో పీక్ స్టేజ్‌లో కేసులు, మరణాలు సంభవించగా.. ఇప్పుడు గణనీయంగా తగ్గాయి. రిపోర్ట్స్ ప్రకారం.. జనవరి మొదటి వారంతో పోలిస్తే కరోనా కేసులు 72 శాతం, మరణాలు 79 శాతం తగ్గాయి. ఈ విషయాన్ని చైనా అంటువ్యాధుల నియంత్రణ కేంద్రం తన అధికారిక వెబ్‌సైట్లో వెల్లడించింది. ఇటీవల ఓ ప్రభుత్వ శాస్త్రవేత్త చైనాలో పరిస్థితులు మరింత దిగజారే అవకాశం ఉందని, ఇప్పటికే చైనా జనాభాలో 80శాతం మంది కరోనా బారినపడ్డారని, త్వరలోనే మరో వేవ్ వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అలాంటి పరిస్థితి లేదని స్పష్టం చేసేందుకే.. చైనా ప్రభుత్వం తాజాగా కరోనా లెక్కలను అధికారికంగా వెల్లడించింది. ప్రభుత్వం లెక్కల ప్రకారం.. జనవరి 4వ తేదీన 1,28,000 కరోనా రోగులుండగా, జనవరి 23 నాటికి ఆ సంఖ్య 36,000కు పడిపోయింది. జనవరి మొదట్లో రోజుకు 4,273 మరణాలు నమోదవ్వగా.. ఇప్పుడు ఆ సంఖ్య 896కు దిగొచ్చింది. జ్వరంతో ఆస్పత్రుల్లో చేరుతున్న రోగ్యుల సంఖ్య డిసెంబర్ 22న 28 లక్షలుండగా.. జనవరి 23 నాటికి ఆ సంఖ్య లక్షా 11వేలకు తగ్గింది.

Shardul Thakur: వరల్డ్‌కప్ జట్టులో శార్దూల్‌కి చోటు.. అంతలేదన్న మాజీ క్రికెటర్

కాగా.. గతేడాది చైనాలో కరోనా విలయతాండవం చేసిన సంగతి తెలిసిందే! మరీ ముఖ్యంగా.. అక్కడ జీరో కొవిడ్ విధానాన్ని ఎత్తేసిన తర్వాత కేసులు గణనీయంగా పెరిగాయి. ఆసుపత్రులు రోగులతో నిండిపోగా.. స్మశానవాటికల ముందు శవాలు క్యూ కట్టేశాయి. ఇది చూసి.. చైనాలో రానున్న రోజుల్లో మరింత దుర్భర పరిస్థితులు వెలుగుచూస్తాయని కొన్ని విశ్లేషణలు వచ్చాయి. చైనావ్యాప్తంగా కేసులతో పాటు మరణాల సంఖ్య విపరీతంగా పెరగొచ్చని అంచనాలూ వచ్చాయి. అయితే.. చైనా ప్రభుత్వం మాత్రం పరిస్థితి అదుపులోనే ఉందంటూ తాజాగా అధికారిక లెక్కల్ని వెల్లడించింది. అయితే.. చైనా వెల్లడించిన వివరాలపై నమ్మకం లేదంటూ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్వయంగా ప్రపంచ ఆరోగ్య సంస్థే సందేహాలు వ్యక్తపరిచింది. తన ప్రతిష్టని కాపాడుకోవడం కోసం చైనా సరైన లెక్కల్ని తెలపడం లేదని, దీంతో అక్కడి మహమ్మారి తీవ్రతను పసిగట్టలేకపోతున్నాయని WHO చెప్పింది.

Prabhas: సింగిల్ కింగులం నుంచి నువ్వెప్పుడూ బయటపడతావ్ డార్లింగ్