Pak ISI And China Forced Out Sheikh Hasina: రిజర్వేషన్ల విషయంలో మొదలైన నిరసనలు బంగ్లాదేశ్ లో అధికారాన్ని మార్చేసింది. బంగ్లా ఆర్మీ చీఫ్ జనరల్ వకార్ తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు. బంగ్లాదేశ్‌లో అల్లకల్లోలం వెనుక పాకిస్థాన్, చైనా హస్తం ఉందని నిఘా వర్గాలు చెబుతున్నాయి. బంగ్లాదేశ్‌లో భారత్‌కు అనుకూలమైన ప్రభుత్వం ఉండటం ఈ రెండు దేశాలు ఇష్టపడలేదు.. అందుకే అక్కడ అల్లర్లను సృష్టించినట్లు పలు నివేదికలు వెల్లడైతున్నాయి. కాగా, ఇప్పుడు బంగ్లాదేశ్‌లో తాత్కాలిక ప్రభుత్వ బాధ్యతను నోబెల్ బహుమతి గ్రహీత ఆర్థికవేత్త డాక్టర్ మహ్మద్ యనస్‌కు అప్పగించారు. బంగ్లాదేశ్‌లో నెలకొన్న అల్లర్లపై ఐక్యరాజ్యసమితి విచారణ జరిపాలని బ్రిటన్ కోరింది. విద్యార్థుల సమస్య ఇంత పెద్దదై తిరుగుబాటు జరిగి.. రాత్రికి రాత్రే ప్రధాని దేశం విడిచి పారిపోవాల్సి వచ్చిందనే ప్రశ్న ప్రపంచవ్యాప్తంగా ప్రజల మదిలో మెదులుతోంది.
Read Also: Thief Escaped: స్టేషన్ నుంచి రెండోసారి దొంగ పరార్.. పోలీసుల నిర్లక్ష్యంపై విమర్శలు..
రిజర్వేషన్లకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలు పెద్దవి కావడంతో సైన్యం, ప్రతిపక్షాలు దానిని సద్వినియోగం చేసుకున్నాయి. సైన్యం కూడా ప్రభుత్వం మాట వినడానికి నిరాకరించింది. ఆందోళనకారులపై చర్యలు తీసుకోబోమని బంగ్లాదేశ్ ఆర్మీ తెలిపింది. నిజానికి ఈ ఆందోళనలో పాకిస్థాన్‌కు చెందిన ఐఎస్‌ఐ కూడా వెనుక నుంచి బల ప్రయోగం చేస్తోంది అని.. ఫండమెంటలిస్ట్ జమాతే ఇస్లామీ విద్యార్థి విభాగం, ఇస్లామిక్ స్టూడెంట్ క్యాంప్ ఈ నిరసనలో చురుకుగా పాల్గొన్నాయని పలు నివేదికలు వచ్చాయి.
Read Also: Best 5G Smartphones 2024: మీ బడ్జెట్ 30 వేలా.. బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ ఇవే!
కాగా, రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ప్రారంభమైన ఉద్యమం షేక్ హసీనాకు వ్యతిరేకంగా కొనసాగింది. హసీనా ప్రభుత్వాన్ని తొలగించి తమకు అనుగుణంగా పనిచేసే ప్రభుత్వాన్ని తీసుకురావాలని పాకిస్థాన్, చైనాలు చాలా కాలంగా కోరుకున్నాయి. భారత్‌పై కుట్ర పన్నేందుకు మాత్రమే పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థలకు ఆశ్రయం ఇస్తోంది. ఐసీఎస్‌ను ముందుకు తీసుకురావడం ద్వారా హసీనా ప్రభుత్వంపై కుట్ర జరుగుతోందని నిఘా సంస్థలు చాలా నెలల క్రితమే సమాచారం అందించాయి.
Read Also: Jammu Kashmir : జమ్మూ కాశ్మీర్‌కు రూ. 1.19 లక్షల కోట్ల జాక్‌పాట్, 4.61 లక్షల మందికి ఉద్యోగాలు!
అయితే, ఐఎస్ఐ మద్దతు ఉన్న జమాతే ఇస్లామీ ఈ సంవత్సరం ప్రారంభంలో చాలా నిధులను పొందిందని ఓ అధికారి తెలిపారు. షేక్ హసీనా ప్రభుత్వంపై కుట్రలు చేసినందుకు మాత్రమే ఈ నిధులు వాడినట్లు ఆరోపించారు. హసీనా సర్కార్ భారతదేశానికి మద్దతుగా ఉండటంతో పాటు తీస్తా ప్రాజెక్టు విషయంలో భారత్ పక్షం వహించి చైనాను పక్కన పెట్టడంతో.. డ్రాగన్ కంట్రీ మండిపడింది. వీటితో పాటు భారతీయ ఏజెన్సీలు కూడా చాలా కాలంగా ఐసీఎస్‌పై నిఘా ఉంచాయి.. బంగ్లాదేశ్‌లోని ఈ విద్యార్థి సంస్థ భారతదేశ వ్యతిరేక, జిహాదీ ఎజెండాలలో నిమగ్నమై ఉందని వెల్లడించింది. ఈ సంస్థ కూడా ఐఎస్ఐ మద్దతుతో హర్కత్- ఉల్- జిహాద్- అల్- ఇలామీ ఆదేశానుసారం పని చేస్తుందని.. వీరికి ఆఫ్ఘనిస్తాన్, పాకిస్థాన్‌లో శిక్షణ ఇస్తున్నట్లు వెల్లడించారు.