China Mine Disaster: ఘోర విషాదం.. బొగ్గు గనిలో పేలుడు.. 80 మంది మృతి
- చైనాలోని షాన్సీ ప్రావిన్స్‌లో భారీ గని ప్రమాదం
- బొగ్గు గనిలో పేలుడు.. 80 మంది మృతి
- 201 మందిని సురక్షితంగా బయటకు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చైనాలోని షాన్సీ ప్రావిన్స్‌లో భారీ గని ప్రమాదం చోటుచేసుకుంది. చాంగ్జీ నగరంలోని లియుషెన్యు బొగ్గు గనిలో జరిగిన భారీ పేలుడులో కనీసం 80 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయినట్లు ప్రభుత్వ మీడియా వెల్లడించింది. ఇంకా పలువురు భూగర్భంలో చిక్కుకుని ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. చైనా అధికారిక వార్తా సంస్థ జిన్హువా తెలిపిన వివరాల ప్రకారం, శుక్రవారం సాయంత్రం ఈ ప్రమాదం జరిగింది. పేలుడు సంభవించిన సమయంలో గనిలో మొత్తం 247 మంది కార్మికులు పనిచేస్తున్నారు. రాత్రంతా కొనసాగిన రెస్క్యూ ఆపరేషన్‌లో శనివారం తెల్లవారుజాము నాటికి 201 మందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.
ఈ ప్రమాదానికి గల అసలు కారణాలు ఇంకా తెలియరాలేదు. గ్యాస్ లీకేజీ లేదా భూగర్భ ఒత్తిడి కారణంగా పేలుడు సంభవించి ఉండవచ్చని ప్రాథమిక అంచనాలు వ్యక్తమవుతున్నాయి. పూర్తి స్థాయి దర్యాప్తు ప్రారంభించినట్లు చైనా అధికారులు తెలిపారు.
Also Read
- Donald Trump: ట్రంప్ కుమార్తెను చంపేందుకు కుట్ర!.. ఖాసిం సులేమానీ మరణానికి ఐఆర్జిసి ప్రతీకార ప్లాన్
- US -Iran Tensions: మళ్లీ యుద్ధ మేఘాలు.. కొడుకు పెళ్లికి కూడా వెళ్లకుండా వైట్ హౌస్‌లో ట్రంప్ హై-లెవెల్ మీటింగ్!
- TulsiGabbard: అమెరికా ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ పదవికి తులసి గబ్బార్డ్ రాజీనామా.. కారణం ఏంటంటే?
- Asim Munir: టెహ్రాన్‌కు వెళ్లిన పాక్ ఆర్మీ చీఫ్ మునీర్.. శాంతి చర్చలపై సర్వత్రా ఆసక్తి
షీ జిన్‌పింగ్ స్పందన
ఈ ఘటనపై చైనా అధ్యక్షుడు Xi Jinping తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గల్లంతైన కార్మికులను రక్షించేందుకు అన్ని వనరులను వినియోగించాలని, ప్రమాదానికి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు జిన్హువా నివేదించింది.
చైనాలో బొగ్గు గనుల ప్రాధాన్యం
షాన్సీ ప్రావిన్స్ చైనాలో ప్రధాన బొగ్గు ఉత్పత్తి కేంద్రంగా గుర్తింపు పొందింది. గత ఏడాది ఈ ప్రావిన్స్‌లోనే 1.3 బిలియన్ టన్నుల బొగ్గు తవ్వినట్లు సమాచారం. ఇది చైనా మొత్తం బొగ్గు ఉత్పత్తిలో దాదాపు మూడవ వంతు.
అయితే భద్రతా లోపాలు, ప్రమాదకరమైన పనివాతావరణం కారణంగా చైనాలో గని ప్రమాదాలు తరచూ జరుగుతూనే ఉన్నాయి. తాజా ఘటన మరోసారి గని కార్మికుల భద్రతపై ఆందోళనలు పెంచింది.
తాజావార్తలు
-
China Mine Disaster: ఘోర విషాదం.. బొగ్గు గనిలో పేలుడు.. 80 మంది మృతి
-
Nagarjuna: “మనం” నా జీవితంలో మరచిపోలేని సినిమా.. నాగార్జున ఎమోషనల్
-
Virat Kohli World Record: SRH మ్యాచ్‌లో విఫలమైనా చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ.. టీ20ల్లో ప్రపంచ రికార్డు
-
Takshaka : వశిష్ట తమ్ముడి డైరెక్షన్లో ‘తక్షక’
-
BSNL: బీఎస్ఎన్ఎల్ చౌకైన ప్లాన్.. రూ. 51కే రోజుకు 2GB డేటా, అపరిమిత కాలింగ్
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్‌తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్‌తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!