Site icon NTV Telugu

China: ఇజ్రాయెల్‌ను ఖాళీ చేయండి.. పౌరులకు చైనా పిలుపు

Chinaisrael

Chinaisrael

ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఏ క్షణంలో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితులు చోటుచేసుకున్నాయి. ప్రస్తుతం ఇరు దేశాలు భీకర దాడులు చేసుకుంటున్నాయి. ఆస్తి, ప్రాణ నష్టాలు ఎక్కువగా జరుగుతున్నాయి.

ఇది కూడా చదవండి: SKN : ‘జాతిని..’ టీ-షర్ట్ వేసిన SKN.. వెనకున్న నిజం ఏంటో తెలుసా?

ఈ నేపథ్యంలో చైనా అప్రమత్తం అయింది. ఇజ్రాయెల్ నుంచి పౌరులు విడిచివెళ్లాలని ఇజ్రాయెల్‌లోని చైనా రాయబార కార్యాలయం కోరింది. చైనా పౌరులంతా జోర్డాన్ వైపు నుంచి ల్యాండ్ క్రాసింగ్‌ల ద్వారా వెళ్లాలని నోటీసులో సూచించింది. ప్రస్తుతం ఇజ్రాయెల్ వైమానిక ప్రాంతం మూసివేసిందని.. భద్రతాకు ముప్పు వాటిల్లే పరిస్థితి నెలకొన్న తరుణంలో భూ సరిహద్దు క్రాసింగ్‌ల ద్వారా వెళ్లిపోవాలని కోరింది.

ఇది కూడా చదవండి: Indian 3 : భారతీయడు మరోసారి వచ్చేందుకు రెడీ అవుతున్నాడు

ఇరాన్ క్షిపణులు ఇజ్రాయెల్ నివాసితుల మధ్య పడడంతో పౌరులు చనిపోతున్నారు. అలాగే నివాసాలు కూడా దెబ్బతింటున్నాయి. ఇక హైఫా, ఇజ్రాయెల్ అంతటా వైమానిక దాడి సైరన్లు మోగుతున్నాయని ఐడీఎఫ్ తెలిపింది. ఇక క్షిపణులను అడ్డగించడానికి తమ వైమానిక రక్షణ వ్యవస్థలు పనిచేస్తున్నాయని తెలిపింది. పౌరులు ఆశ్రయాల్లోకి ప్రవేశించి తదుపరి నోటీసు వచ్చే వరకు అక్కడే ఉండాలని పిలుపునిచ్చింది.

ఇదిలా ఉంటే ఈ వారంలో అమెరికా-ఇరాన్‌ మధ్య చర్చలు జరిగే అవకాశం ఉందని ఆక్సియోస్ నివేదించింది. అమెరికా రాయబారి స్టీవ్ విట్కాఫ్- ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చి మధ్య సమావేశం జరిగే అవకాశంపై వైట్ హౌస్ ఇరాన్‌తో చర్చలు జరుపుతున్నట్లు ఆక్సియోస్ వార్తా సంస్థ తెలిపింది. అణు ఒప్పందం, ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య యుద్ధానికి ముగింపుతో కూడిన దౌత్యపరమైన చొరవపై చర్చించనున్నారు.

Exit mobile version