China: పెంటగాన్ కన్నా 10 రెట్లు పెద్దదైన మిలిటరీ ఫెసిలిటీ.. యూఎస్‌కి చైనా మరో సవాల్..
- అమెరికాకు చైనా మరో సవాల్..
- పెంటగాన్ కన్నా 10 రెట్ల పెద్ద భవనం..
- అగ్రరాజ్య హోదా కోసం వడివడిగా అడుగులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
China: చైనా అన్ని రంగాల్లో అమెరికాకు సవాల్ విసురుతోంది. ఆర్థిక వ్యవస్థ, సైనిక వ్యవస్థ, టెక్నాలజీలో అమెరికాను మించి ఎదగాలని చైనా భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే తన కార్యాచరణ వేగాన్ని పెంచింది. యూఎస్‌ని కాదని అగ్రరాజ్య హోదా తెచ్చుకోవాలని చూస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల చైనా ఏఐ చాట్‌బాట్ ‘‘డీప్ సీక్’’ పెద్ద సంచలనమే సృష్టించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI)లో అగ్రగామిగా ఉన్న అమెరికాకు చుక్కలు చూపించింది.
ఇదిలా ఉంటే, అమెరికా మిలిటరీ హెడ్‌క్వార్టర్ పెంటగాన్‌కి 10 రెట్లు పెద్దదైన భారీ మిలిటరీ ఫెసిలిటీని నిర్మించేందుకు చైనా సిద్ధమైందని యూఎస్ ఇంటెలిజెన్స్ అధికారులు పేర్కొన్నట్లు ఫైనాన్షియల్ టైమ్స్ ఒక నివేదికలో పేర్కొంది. “బీజింగ్ మిలిటరీ సిటీ”గా పిలువబడే ఈ ప్రాజెక్టు నిర్మాణం 2024 మధ్యలో ప్రారంభమైంది, ఇటీవలి ఉపగ్రహ చిత్రాలతో రాజధాని నగరానికి నైరుతి దిశలో 30 కి.మీ దూరంలో ఉన్న 1,500 ఎకరాల ప్రాంతంలో నిర్మాణం కోసం తవ్విన పెద్దపెద్ద రంధ్రాలను చూపిస్తోంది.
Also Read
- Trump: ఇరాన్ సుంకాలు విధిస్తే మేమూ విధిస్తాం.. హార్ముజ్‌పై ట్రంప్ వార్నింగ్
- US Military: అమెరికా ఆయుధ బలం తగ్గిందా? ఇరాన్ యుద్ధం తర్వాత బయటపడిన షాకింగ్ నిజాలు ఇవే!
- North Korea: మీ కుక్కల మాంసంతో సూప్ చేసుకుని తాగండి.. ఉత్తర కొరియా విచిత్ర సలహా..
- Sheikh Hasina: విద్యార్థి ఉద్యమం కాదు, రెజిమ్ ఛేంజ్ కుట్ర.. 2 ఏళ్ల తర్వాత మౌనం వీడిన షేక్ హసీనా..
Read Also: Mallikarjun Kharge: మోసం చేసే బడ్జెట్ ప్రవేశపెట్టి ప్రశంసలు కోరుకుంటున్నారు
కొత్తగా చైనా నిర్మిస్తున్న ఈ భవనంలో బంకర్లు ఉండొచ్చని, అణు యుద్ధంతో సహా ఏదైనా సంఘర్షణ సమయంలో కమ్యూనిస్ట్ పార్టీ చైనా పొలిట్ బ్యూరో అధికారులను రక్షించేందుకు నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. పెంటగాన్ కన్నా 10 రెట్లు పెద్దదైన నిర్మాణంతో, జి జిన్‌పింగ్ అమెరికాను అధిగమించాలని భావిస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఈ ప్రాజెక్టు వివరాలను వాషింగ్టన్‌లోని చైనా రాయబార కార్యాలయం తమకు తెలియదని పేర్కొంటూ రహస్యంగా ఉంచారు.
పెంటగాన్ అమెరికా రక్షణ శాఖ ప్రధాన కార్యాలయంగా పనిచేస్తోంది. వర్జీనియా రాష్ట్రంలోని అర్లింగ్టన్‌లో ఉంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద కార్యాలయ భవనాల్లో ఒకటి. ఇది వాషింగ్టన్ విదేశాంగ విధానానికి కూడా కేంద్రంగా ఉంది. ఇటీవల కాలంలో చైనా తన అణ్వాయుధ సామర్థ్యాన్ని పెంచుకుంటూ పోతోందని అమెరికా చెబుతోంది. పెంటగాన్ ప్రకారం, 2035 నాటికి బీజింగ్ వద్ద 1,500 ఆపరేబుల్ అణ్వాయుధాలు ఉంటాయి, ఇవి యునైటెడ్ స్టేట్స్ యొక్క మందుగుండు సామగ్రికి సమానంగా ఉంటాయి.
- Tags
- china
- Pentagon
- USA
- USA-China
- Xi Jinping
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్‌బాల్ మ్యాచ్‌పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్‌వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!