China: చైనా అన్ని రంగాల్లో అమెరికాకు సవాల్ విసురుతోంది. ఆర్థిక వ్యవస్థ, సైనిక వ్యవస్థ, టెక్నాలజీలో అమెరికాను మించి ఎదగాలని చైనా భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే తన కార్యాచరణ వేగాన్ని పెంచింది. యూఎస్‌ని కాదని అగ్రరాజ్య హోదా తెచ్చుకోవాలని చూస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల చైనా ఏఐ చాట్‌బాట్ ‘‘డీప్ సీక్’’ పెద్ద సంచలనమే సృష్టించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI)లో అగ్రగామిగా ఉన్న అమెరికాకు చుక్కలు చూపించింది.