NTV Telugu Site icon

Israel: ఇజ్రాయిల్ ఎలైట్ ఇంటెలిజెన్స్ గ్రూప్ ‘‘యూనిట్ 8200’’ చీఫ్ రాజీనామా.. కారణం ఇదే..

Yossi Sariel

Yossi Sariel

Israel: ఇజ్రాయిల్ అత్యున్నత ఇంటెలిజెన్స్ ఎజెన్సీ ‘యూనిట్ 8200’ చీఫ్ రాజీనామా చేయనున్నట్లు ఆ దేశ సైన్యం గురువారం ప్రకటించింది. “8200 యూనిట్ కమాండర్, (బ్రిగేడియర్ జనరల్) యోస్సీ సారిల్, తన పదవినికి రాజీనామా చేయాలనే ఉద్దేశాన్ని తన కమాండర్లు మరియు సబార్డినేట్‌లకు తెలియజేసారు’’ అని ఇజ్రాయిల్ సైన్యం ఒక ప్రకటనలో తెలిపింది. రాబోయే రోజుల్లో ఆయన తన పదవిని ముగించనున్నట్లు పేర్కొంది.

ఇజ్రాయిల్ ఎలైట్ ఇంటెలిజెన్స్‌గా ఉన్న యూనిట్ 8200, డీకోడింగ్ మరియు ఇంటర్‌సెప్ట్, ఇతర సిగ్నల్ ఇంటెలిజెన్స్‌ని విశ్లేషించే బాధ్యతల్ని కలిగి ఉంది. అక్టోబర్ 07 నాటి హమాస్ దాడి తర్వాత ఇజ్రాయిల్ ఇంటెలిజెన్స్ విభాగం విఫలమైందనే ఆరోపణలు వచ్చాయి. అంతపెద్ద దాడికి హమాస్ ప్లాన్ చేస్తున్నా కూడా ఒక్క సమాచారం కూడా ఇంటెలిజెన్స్ ఏజెన్సీ వద్ద లేకపోయింది. ఈ దాడి తర్వాత దాని కమాండర్ మేజర్ జనరల్ అహరోన్ హలీవా ఏప్రిల్ 2024లో తన రాజీనామాను ప్రకటించారు. అక్టోబర్ 7న జరిగిన దాడిని భగ్నం చేయడంలో డైరెక్టరేట్ విఫలమైందని హలీనాను విధుల నుంచి తప్పించాలని కోరినట్లు సైన్యం తెలిపింది.

Read Also: Pakistan: పాకిస్తాన్‌లో ఆర్మీ వర్సెస్ పోలీస్.. సైన్యం తమ విధుల్లో జోక్యం చేసుకుంటుందని నిరసన..

అక్టోబర్ 7నాటి ఘటనను గురించి..మాకు అప్పగించిన మిషన్‌‌ని నెరవేర్చనందుకు క్షమాపణలు కోరుతూ సారిల్ తన రాజీనామా లేఖను అందించాడు. సెప్టెంబర్ 2023లో యూనిట్ 8200 తయారు చేసిన ఇంటెలిజెన్స్ ఇన్‌పుట్స్‌లో హమాస్ దాడికి సన్నాహాలు చేస్తుందనే నిఘా సమాచారం ఉంది. యూనిట్ 8200 డాక్యుమెంట్‌లో బందీల కోసం శిక్షణ పొందిన ఎలైట్ హమాస్ యోధుల వివరాలు మరియు దక్షిణ ఇజ్రాయెల్‌లోని సైనిక స్థానాలు మరియు ఇజ్రాయెల్ కమ్యూనిటీలపై దాడులకు సంబంధించిన ప్రణాళికలు ఉన్నాయి. అయితే, వీటిని పెద్దగా పట్టించుకోకపోవడంతోనే ఇజ్రాయిల్ దానిని ఎదుర్కోవాల్సి వచ్చింది.

అక్టోబర్ 07 నాటి దాడిలో 1205 మందికి పైగా ఇజ్రాయిలీ ప్రజలు చంపబడ్డారు. 240 మంది బందీలుగా పట్టుకుని గాజాలోకి తీసుకెళ్లారు. వీరిలో కొంత మంది చంపబడ్డారు. ఈ దాడి అనంతరం నుంచి ఇజ్రాయిల్ హమాస్‌పై దాడులు చేస్తోంది. దీని కారణంగా గాజాలో 40 వేలకు పైగా మరణించారు.