Israel: ఇజ్రాయిల్ ఎలైట్ ఇంటెలిజెన్స్ గ్రూప్ ‘‘యూనిట్ 8200’’ చీఫ్ రాజీనామా.. కారణం ఇదే..
- ఇజ్రాయిల్ ఇంటెలిజెన్స్ గ్రూప్ ‘‘యూనిట్ 8200’’ చీఫ్ రాజీనామా..
- అక్టోబర్ 07 నాటి హమాస్ దాడిని ఎదుర్కోకపోవడంతోనే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Israel: ఇజ్రాయిల్ అత్యున్నత ఇంటెలిజెన్స్ ఎజెన్సీ ‘యూనిట్ 8200’ చీఫ్ రాజీనామా చేయనున్నట్లు ఆ దేశ సైన్యం గురువారం ప్రకటించింది. “8200 యూనిట్ కమాండర్, (బ్రిగేడియర్ జనరల్) యోస్సీ సారిల్, తన పదవినికి రాజీనామా చేయాలనే ఉద్దేశాన్ని తన కమాండర్లు మరియు సబార్డినేట్‌లకు తెలియజేసారు’’ అని ఇజ్రాయిల్ సైన్యం ఒక ప్రకటనలో తెలిపింది. రాబోయే రోజుల్లో ఆయన తన పదవిని ముగించనున్నట్లు పేర్కొంది.
ఇజ్రాయిల్ ఎలైట్ ఇంటెలిజెన్స్‌గా ఉన్న యూనిట్ 8200, డీకోడింగ్ మరియు ఇంటర్‌సెప్ట్, ఇతర సిగ్నల్ ఇంటెలిజెన్స్‌ని విశ్లేషించే బాధ్యతల్ని కలిగి ఉంది. అక్టోబర్ 07 నాటి హమాస్ దాడి తర్వాత ఇజ్రాయిల్ ఇంటెలిజెన్స్ విభాగం విఫలమైందనే ఆరోపణలు వచ్చాయి. అంతపెద్ద దాడికి హమాస్ ప్లాన్ చేస్తున్నా కూడా ఒక్క సమాచారం కూడా ఇంటెలిజెన్స్ ఏజెన్సీ వద్ద లేకపోయింది. ఈ దాడి తర్వాత దాని కమాండర్ మేజర్ జనరల్ అహరోన్ హలీవా ఏప్రిల్ 2024లో తన రాజీనామాను ప్రకటించారు. అక్టోబర్ 7న జరిగిన దాడిని భగ్నం చేయడంలో డైరెక్టరేట్ విఫలమైందని హలీనాను విధుల నుంచి తప్పించాలని కోరినట్లు సైన్యం తెలిపింది.
Also Read
Read Also: Pakistan: పాకిస్తాన్‌లో ఆర్మీ వర్సెస్ పోలీస్.. సైన్యం తమ విధుల్లో జోక్యం చేసుకుంటుందని నిరసన..
అక్టోబర్ 7నాటి ఘటనను గురించి..మాకు అప్పగించిన మిషన్‌ని నెరవేర్చనందుకు క్షమాపణలు కోరుతూ సారిల్ తన రాజీనామా లేఖను అందించాడు. సెప్టెంబర్ 2023లో యూనిట్ 8200 తయారు చేసిన ఇంటెలిజెన్స్ ఇన్‌పుట్స్‌లో హమాస్ దాడికి సన్నాహాలు చేస్తుందనే నిఘా సమాచారం ఉంది. యూనిట్ 8200 డాక్యుమెంట్‌లో బందీల కోసం శిక్షణ పొందిన ఎలైట్ హమాస్ యోధుల వివరాలు మరియు దక్షిణ ఇజ్రాయెల్‌లోని సైనిక స్థానాలు మరియు ఇజ్రాయెల్ కమ్యూనిటీలపై దాడులకు సంబంధించిన ప్రణాళికలు ఉన్నాయి. అయితే, వీటిని పెద్దగా పట్టించుకోకపోవడంతోనే ఇజ్రాయిల్ దానిని ఎదుర్కోవాల్సి వచ్చింది.
అక్టోబర్ 07 నాటి దాడిలో 1205 మందికి పైగా ఇజ్రాయిలీ ప్రజలు చంపబడ్డారు. 240 మంది బందీలుగా పట్టుకుని గాజాలోకి తీసుకెళ్లారు. వీరిలో కొంత మంది చంపబడ్డారు. ఈ దాడి అనంతరం నుంచి ఇజ్రాయిల్ హమాస్‌పై దాడులు చేస్తోంది. దీని కారణంగా గాజాలో 40 వేలకు పైగా మరణించారు.
తాజావార్తలు
-
Vijayawada: భక్తులకు సువర్ణావకాశం.. ఇంద్రకీలాద్రిపై రేపటి నుంచి ఉచిత యోగా శిక్షణ
-
Prashant Kishor: రూ.10 వేలతో ఓట్లు కొని గెలిచారు.. నితీష్‌కుమార్‌పై మరోసారి ప్రశాంత్ కిషోర్ విమర్శలు
-
Rama Nandana: యూట్యూబర్స్ ‘గలీజ్ దందా’ స్కామ్.. రంగంలోకి దిగిన తెలంగాణ పోలీస్..
-
Sourav Ganguly: మమతకు మద్దతుగా యూసుఫ్ పఠాన్‌ను గంగూలీ రాజీనామా చేయమన్నారా..? ఇదిగో క్లారిటీ..
-
IND Vs AFG: అదరగొట్టిన భారత బ్యాటర్లు.. తొలిరోజే రెండు సెంచరీలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!