Site icon NTV Telugu

Charlie Kirk: చార్లీ కిర్క్‌ను చంపింది 22 ఏళ్ల టైలర్ రాబిన్సన్.. హత్య చేసింది ఇందుకేనా..

Kirk

Kirk

Charlie Kirk: డొనాల్డ్ ట్రంప్ సన్నిహితుడైన చార్లీ కిర్క్‌ను కాల్చి చంపిన నిందితుడిని అరెస్ట్ చేశారు. ఉటాకు చెందిన 22 ఏళ్ల టైలర్ రాబిన్సన్‌ను నిందితుడిగా గుర్తించినట్లు ఉటా గవర్నర్ స్పెన్సర్ జె కాక్స్ తెలిపారు. నిందితుడు ఇటీవల కాలంలో రాబిన్సన్ ‘‘రాజకీయంగా తీవ్రంగా ప్రభావితం అయ్యాడు’’ అని గవర్నర్ చెప్పారు. ముఖ్యంగా, చార్లీ కిర్క్ నమ్మకాలను వ్యతిరేకిస్తున్నాడని, హత్య చేసింది తానే అని తన ఫ్యామిలీ ఫ్రెండ్‌కు చెప్పినట్లు వెల్లడించారు.

చార్లీని చంపిన నిందితుడిని తాము పట్టుకున్నామని ట్రంప్ చెప్పిన కొన్ని గంటల తర్వాత నిందితుడి వివరాలను ఎఫ్‌బీఐ వెల్లడించింది. ఉటా యూనివర్సిటీలో 3000 మంది జనసమూహాన్ని ఉద్దేశిస్తూ చార్లీ ప్రసంగిస్తున్న సమయంలో రాబిన్సన్ అతడి మెడపై కాల్చి చంపాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే అతను ఆస్పత్రిలో మరణించాడు. ఘటన జరిగిన 33 గంటల్లోనే నిందితుడిని పట్టుకున్నట్లు ఎఫ్‌బీఐ చీఫ్ కాష్ పటేల్ తెలిపారు.

Read Also: Bengaluru: భారీ గుంతలో పడిన స్కూల్ బస్సు… తృటిలో తప్పిన పెన ప్రమాదం

కాల్పులు జరిపిన తర్వాత నిందితుడు భవనం పైకప్పు నుంచి దిగి, క్యాంపస్ బయట రోడ్డు పక్కన ఉన్న చిన్న అడవిలోకి ప్రవేశించాడు. అక్కడే అధికారులు కాల్పులకు ఉపయోగించిన అధిక శక్తి కలిగిన బోల్ట్ యాక్షన్ రైఫిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడి చేతి ముద్రలు, మరకల్ని డీఎన్ఏ పరీక్షల కోసం పరిశోధకులు సేకరిస్తున్నారు.

ట్రంప్‌కు అత్యంత సన్నిహితుడు, రిపబ్లికన్ మద్దతుదారుగా పేరున్న చార్లీ కిర్క్ గత అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలుపు కోసం పనిచేశారు. మరణానంతరం ట్రంప్ ప్రభుత్వం అతడికి దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘‘ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ప్రీడమ్’’ను ప్రదానం చేస్తామని ప్రకటించింది. చార్లీ హత్య నిందితుడిని పట్టుకున్నందుకు వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ ఉటా రాష్ట్ర అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.

Exit mobile version