Ukraine War: ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. యుద్ధం ముగింపుకు సిద్ధంగా ఉన్నట్లు రష్యా ప్రకటించిన నేపథ్యంలో, చర్చలకు తాము కూడా సిద్ధంగా ఉన్నట్లు ఉక్రెయిన్ కూడా ప్రకటించింది. రష్యా యుద్ధ ముగింపు చర్చల్ని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ స్వాగతించారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. రష్యా యుద్ధం ముగించడం గురించి ఆలోచించడం ప్రారంభించిందని, కానీ రష్యా వైపు నుంచి మే 12 నుంచి కాల్పుల విరమణ పాటించడమే మొదటి అడుగు అని ఆయన అన్నారు.
Read Also: PCB: జన్మలో పాక్ లో అడుగుపెట్టను.. ఇజ్జత్ తీసుకున్న PCB
“రష్యన్లు చివరకు యుద్ధాన్ని ముగించడం గురించి ఆలోచించడం ప్రారంభించారనేది సానుకూల సంకేతం … మరియు ఏదైనా యుద్ధాన్ని నిజంగా ముగించడంలో మొదటి అడుగు కాల్పుల విరమణ,” అని జెలెన్ స్కీ ఎక్స్‌లో రాసుకొచ్చారు. ఒక్క రోజు కూడా హత్యల్ని కొనసాగించడంలో అర్థం లేదని, రేపు మే 12 నుంచి రష్యా పూర్తి, శాశ్వత, నమ్మదగిన కాల్పుల విరమణను నిర్ధారించాలని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.
