Site icon NTV Telugu

Terror attack: కెనడాలో జనాలపైకి దూసుకెళ్లిన కారు.. ఉగ్రదాడిగా అనుమానం..

Canada

Canada

Terror attack: శనివారం రాత్రి కెనడాలో ఘోర సంఘటన జరిగింది. వాంకోవర్‌లో జరిగి ఓ ఫెస్ట్‌‌లో దుండగుడు జనాలపైకి కారును వేగంగా నడిపి, దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో అనేక మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. చాలా మంది గాయపడ్డారని స్థానిక పోలీసులు తెలిపారు. దాడికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని 30 ఏళ్ల వాంకోవర్ వాసిగా గుర్తించారు. కారు డ్రైవర్ ఒక ఆసియా యువకుడిగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

మరణించిన వారి సంఖ్యను అధికారులు ఇంకా నిర్ధారించలేదు. దాడికి సంబంధించిన వీడియోలో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. రోడ్డుపై మృతదేహాలు చెల్లచెదురుగా పడి ఉన్నట్లు వీడియోలు చూపిస్తున్నాయి. ఫిలిప్పీన్స్ వారసత్వం మరియు సంస్కృతిని జరుపుకునే లాపు లాపు డే ఉత్సవంలో ఈ దాడి జరిగింది. దీనిపై వాంకోవర్ మేయర్ కెన్ సిమ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Read Also: CM Siddaramiah: ‘‘పాకిస్తాన్ రత్న’’.. పాకిస్తాన్‌లో సంచలనంగా సిద్ధరాయమ్య కామెంట్స్..

సంఘటన వెనక ఉన్న ఉద్దేశ్యాన్ని స్థానిక అధికారులు ఇంకా నిర్ధారించనప్పటికీ, ప్రాథమికంగా దీనిని ఉగ్ర దాడిగా అనుమానిస్తున్నారు. యూరప్, యూఎస్, కెనడాలో ఇలాంటి దాడులు ఇంతకుముందు జరిగాయి. ఈ ఘటనలో నిందితులు మతోన్మాదంతో దాడికి పాల్పడినట్లు గుర్తించారు.

ఈ ఏడాది న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా, 42 ఏళ్ల అమెరికన్ వ్యక్తి షంసుద్-దిన్ జబ్బర్ తన పికప్ ట్రక్కును న్యూ ఓర్లీన్స్‌లోని రద్దీగా ఉండే వీధిలో నడిపాడు. ఈ దాడిలో 14 మంది మరణించారు. 57 మంది గాయపడ్డారు. చివరకు నిందితుడిని పోలీసులు కాల్చి చంపారు. అతడి కారు నుంచి ఐసిస్ జెండాను స్వాధీనం చేసుకున్నారు. బెర్లిన్ లండన్, న్యూయార్క్ వంటి నగరాల్లో ఇలాంటి దాడులు జరిగాయి.

Exit mobile version