NTV Telugu Site icon

Israel: ఇజ్రాయెల్‌ సైన్యంలో తొలి మరణం.. లెబనాన్‌లో ఒకరు చనిపోయినట్లు వెల్లడి

Firstcombatdeath

Firstcombatdeath

గతేడాది అక్టోబర్ నుంచి హమాస్‌తో మొదలైన ఇజ్రాయెల్ యుద్ధం ఇప్పటిదాకా ఏకధాటిగా కొనసాగించింది. గాజాను నేలమట్టం చేసింది. ఇప్పుడు హిజ్బుల్లా లక్ష్యంగా లెబనాన్‌లో దాడులు చేస్తోంది. ఇన్ని రోజులు పోరాటంలో ఇజ్రాయెల్ చాలా జాగ్రత్తగా యుద్దం చేస్తోంది. అయితే బుధవారం లెబనాన్‌లో జరిగిన దాడిలో ఇజ్రాయెల్ సైన్యం.. ఒక వీరుడ్ని కోల్పోయింది. ఇజ్రాయెల్ సైన్యంలో తొలి మరణం జరిగిందని ఇజ్రాయెల్ మిలటరీ తెలిపింది.

కెప్టెన్ ఈటాన్ ఇట్జాక్ ఓస్టర్(22) లెబనాన్‌తో జరిగిన యుద్ధంలో చనిపోయాడని ఇజ్రాయెల్ మిలటరీ ఒక ప్రకటనలో తెలిపింది. మిలిటరీ వెబ్‌సైట్‌లో వివరాలను అందించకుండానే బుధవారం ఓస్టర్ హత్యకు గురైనట్లు పేర్కొంది. దక్షిణ సరిహద్దు గ్రామంలోకి చొరబడిన ఇజ్రాయెల్ దళాలతో హిజ్బుల్లా యోధులు ఎదురుదాడులకు దిగినప్పుడు ఈ ఘటన చోటుచేసుకుంది. ఈశాన్య సరిహద్దు గ్రామమైన అడేస్సేలోకి ప్రవేశించడానికి ప్రయత్నించిన తర్వాత ఇజ్రాయెల్ సైనికులు వెనక్కి వెళ్లిపోయారు.

ఇది కూడా చదవండి: Russia: అరబ్ దేశాలతో రష్యా అత్యవసర భేటీ.. తాజా పరిణామాలపై చర్చ

ఇజ్రాయెల్ సైన్యం.. దక్షిణ లెబనాన్‌లోని అదనపు ప్రాంతాలను ఖాళీ చేయమని బుధవారం పిలుపునిచ్చింది. దక్షిణ లెబనాన్‌లోని 20 గ్రామాలు మరియు పట్టణాలను విడిచిపెట్టమని నివాసితులకు ఆదేశించింది. భూతల దాడులు చేసేందుకు ఇజ్రాయెల్ సైన్యం సిద్ధమైంది. లెబనాన్‌ భూభాగంలోకి సుమారు 400 మీటర్ల బ్లూలైన్‌లోకి ఇజ్రాయల్ దళాలు వచ్చాయి. కొద్దిసేపటికే ఉపసంహరించుకున్నాయి.

హిజ్బుల్లా అధినేత నస్రల్లా మరణం తర్వాత పశ్చిమాసియాలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఇక మంగళవారం ఇరాన్ దూకుడు ప్రదర్శించింది. ఇజ్రాయెల్‌పై ఒకేసారి 180 క్షిపణులను ప్రయోగించింది. అయితే ఇజ్రాయెల్ గగనతలంలోనే తిప్పికొట్టింది. అయితే కొన్ని టెల్అవీవ్, జెరూషలేంలో పడ్డాయి. అయితే ఎవరికీ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.

ఇది కూడా చదవండి: Minister Seethakka: మాజీ మహిళా మంత్రుల చరిత్ర.. ఇప్పటి మహిళా మంత్రుల చరిత్ర ప్రజలకు తెలుసు