Imran Khan: పాకిస్తాన్ మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. తాను ఇప్పుడుంటున్న జైల్లో ఉండలేనని.. తనను వేరే జైలుకు మార్చేలా చూడాలని తన తరపు న్యాయవాదులకు చెప్పినట్టు పాక్ మీడియా వెల్లడించింది. తాను ఉంటున్న జైల్లో పురుగులు ఎక్కువగా ఉన్నాయని.. అందుకే వేరే జైలుకు మార్చేలా చూడాలని కోరారని ప్రకటించాయి. ఇమ్రాన్ ఖాన్ తోషాఖానా కేసులో అరెస్టు అయి జైల్లో ఉన్న విషయం తెలిసిందే. జైల్లో ఉన్న పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్‌ను ఓ చీకటి గదిలో ఉంచినట్లు వార్తలు బయటికి వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాను ఆ పురుగుల జైల్లో ఉండలేనని.. అక్కడ నుంచి తీసుకెళ్లండని న్యాయవాదులతో చెప్పినట్టు పాక్ మీడియా ప్రకటించింది.
Read also: Rachakonda CP: చైన్ స్నాచర్లపై స్పెషల్ ఫోకస్ పెట్టాం
ప్రధాన మంత్రిగా పనిచేసిన తనను సీ-క్లాస్ వసతులున్న జైల్లో పెట్టారని.. ఆ జైలు గదిలోనే పూర్తిగా నిర్బంధిస్తారని తీవ్ర ఆందోళన వ్యక్తం చేసినట్లు పాక్ మీడియా వెల్లడించింది. తోష్‌ఖానా అవినీతి కార్యకలాపాల కేసులో ఇమ్రాన్‌ఖాన్‌కు ఇస్లామాబాద్ ట్రయల్ కోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. వెంటనే అరెస్టు చేసిన పోలీసులు పంజాబ్ ప్రావిన్సులోని అటక్ జైలుకు తరలించారు. జైల్లోని చిన్న చీకటి గదిలో ఆయన్ను ఉంచారని.. అందులో చీమలు, ఈగలు ఉన్నాయని తనను కలిసిన న్యాయవాదుల ముందు ఇమ్రాన్ ఖాన్ చెప్పినట్టు తెలుస్తోంది. తాను ఆ జైల్లో ఉండలేనని.. అక్కడ నుంచి తీసుకెళ్లమని కోరినట్లు న్యాయవాదులు వెల్లడించారు. ఎన్ని ఇబ్బందులున్నా ఇమ్రాన్ ఆత్మస్థైర్యంతోనే ఉంటారని.. బానిసత్వానికి తలొగ్గనని చెప్పినట్లు పాక్ మీడియాకు వివరించారు. అటక్ జైల్లో ఉన్న తమ అధినేత ఇమ్రాన్‌ఖాన్‌ను అదియాలా జైలుకు మార్చాలని.. ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని కోరుతూ పాకిస్థాన్ తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్ (PTI) పార్టీ సభ్యులు ఇస్లామాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఇమ్రాన్‌ఖాన్‌పై అయిదేళ్లపాటు అనర్హత వేటు వేస్తున్నట్లుగా పాక్‌స్థాన్ ఎన్నికల సంఘం ప్రకటించింది. బుధవారం తాను రాజీనామా చేస్తానని ప్రకటించిన ప్రధాని షెహబాజ్ రాజీనామా చేయకుండా తోషాఖానా బహుమతులను వేలం వేయనున్నట్టు ప్రకటించారు. తన రాజీనామాను ఎప్పుడు ప్రకటిస్తారనేది చెప్పలేదు.
