NTV Telugu Site icon

German Chancellor: ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో సోషల్ మీడియా అధినేతలు నిర్ణయించొద్దు..

Jarman

Jarman

German Chancellor: ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో సోషల్ మీడియా అధినేతలు నిర్ణయించకుండా చూసుకోవాలని జర్మన్‌ ఛాన్సలర్‌ ఒలాఫ్‌ షోల్జ్‌ కామెంట్స్ చేశారు. ఫిబ్రవరి 23వ తేదీన జరిగే ఎన్నికల్లో పూర్తిగా జర్మన్‌ ప్రజల ప్రమేయం మాత్రమే ఉండాలని ఆయన కోరారు. అతివాద పార్టీ ఆల్టర్‌నేటివ్ ఫర్ డౌచ్‌లాండ్‌కు టెస్లా సీఈఓ ఎలాన్‌ మస్క్‌ సపోర్ట్ ప్రకటించిన నేపథ్యంలో ఈ విధంగా స్పందించారు. న్యూ ఇయర్ ను పురస్కరించుకొని షోల్జ్‌ టెలివిజన్ కు ఇచ్చిన ఇంటర్య్వూలో ఒలాఫ్ షోల్జ్ ఈ వ్యాఖ్యలు చేశారు.

Read Also: Traffic Rules In Hyderabad: హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు.. అతి చేసారో..?

కాగా, పార్లమెంటులో జర్మనీ ఛాన్సలర్‌ ఓలాఫ్‌ షోల్జ్‌ విశ్వాసం కోల్పోయారు. ఇందులో 733 మంది సభ్యులు ఉన్న సభలో ఇటీవల ఓటింగ్‌ జరిగింది.. ఆయనకు అనుకూలంగా కేవలం 207 ఓట్లు రాగా.. వ్యతిరేకంగా 394 మంది ఓట్లు పడ్డాయి. మెజారిటీకి 367 ఓట్లు కావాలి.. దీంతో అక్కడ ముందస్తు ఎన్నికలు జరుగుతున్నాయి. ఫిబ్రవరి 23వ తేదీన ఈ పోలింగ్ జరగబోతుంది. జర్మనీ ఛాన్స్‌లర్‌గా ఒలాఫ్ షోల్జ్‌ తాత్కాలికంగా పదవీ బాధ్యతల్లో కొనసాగుతున్నారు.

Read Also: Parliament scuffle: ఆ రోజు రాహుల్‌ గాంధీ ఒక ఎంపీలా కాకుండా బౌన్సర్‌లా ప్రవర్తించారు..

అయితే, ఈ నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీకి ఎలాన్ మస్క్‌ మద్దతు ఇవ్వడంపై ఓలాప్ షోల్జ్ రియాక్ట్ అయ్యాడు. మస్క్ పేరును ప్రస్తావించకుండానే ఎన్నికల్లో అవకతవకలను నిరోధించాలని, ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. అలాగే, నకిలీ సమాచారంపై ప్రజలు అలర్ట్ గా ఉండాలని సూచించారు. అది దేశానికి ప్రమాదకరమని జర్మనీ ఛాన్సలర్ షోల్జ్ హెచ్చరించారు.

Show comments