NTV Telugu Site icon

Justin Trudeau: 50 ఏళ్లలో అత్యంత చెత్త కెనడా ప్రధాని ట్రూడో.. ప్రజామద్దతు ప్రతిపక్ష నేతకే..

Justin Trudeau

Justin Trudeau

Justin Trudeau: ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత ప్రమేయం ఉందని వ్యాఖ్యలు చేస్తున్న కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఇంటా, బయట వ్యతిరేకత ఎదురుకొంటున్నారు. భారత్‌ని కాదని అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా వంటి కెనడా మిత్రదేశాలు వ్యవహరించే పరిస్థితి లేకపోవడంతో కెనడా ప్రభుత్వానికి చుక్కెదురు అవుతోంది. ఇదిలా ఉంటే కెనడాలో జస్టిన్ ట్రూడో తన ప్రజాధరణ కోల్పోతున్నారని తాజాగా ఓ సర్వేలో తేలింది.

కెనడా గ్లోబల్ న్యూస్ సర్వేలో ఈ కీలక విషయాలు వెల్లడయ్యాయి. కెనడా ప్రజల మద్దతు కన్జర్వేటివ్ పార్టీకి చెందిన ప్రతిపక్ష నేత పియరీ పోయిలీవ్రేకు ఎక్కువగా ఉంది. దాదాపుగా 40 శాతం కెనడియన్లు పియరీని ప్రధానిగా చూడాలని అనుకుంటున్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగే ఆయన పార్టీకి 39 శాతం ఓట్లు వస్తాయిని పోల్స్ వెల్లడించాయి. లిబరల్ పార్టీ నేత, ప్రధానిగా ఉన్న జస్టిన్ ట్రూడోకి 30 శాతం ఓట్లతో సరిపెట్టుకోవాల్సి వస్తుందని వెల్లడించింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ట్రూడో పార్టీ అధికారాన్ని కోల్పోతుందని వెల్లడించింది. కెనడాలో 2025 చివర్లో ఎన్నికలు జరగాల్సి ఉంది.

Read Also: Ghost: గ్యాంగ్ స్టర్ శివన్న వచ్చేసాడు… సాంగ్ KGF రేంజులో ఉందిగా

జూలై నెలలో జరిగిన సర్వేలో.. 50 ఏళ్లలో జస్టిన్ ట్రూడో అత్యంత చెత్త ప్రధానమంత్రి అని తేలింది. సీటీవీ న్యూస్ ప్రకారం..జస్టిన్ ట్రూడో తండ్రి పియరీ ట్రూడో 1968-79, 1980-84 మధ్య కెనడా ప్రధానిగా పనిచేసి, అక్కడి ప్రజల్లో ప్రజాధరణ పొందారు. ప్రస్తుతం జస్టిన్ ట్రూడో నేతృత్వంలోని ఖలిస్తానీ సానుభూతిపరుడైన భారత సంతతికి చెందిన జగ్మీత్ సింగ్ నేతృత్వంలోని న్యూ డెమోక్రటిక్ పార్టీ(ఎన్డీపీ)తో అధికారాన్ని పంచుకుంటుంది. ప్రస్తుతం జగ్మీత్ సింగ్ పాపులారిటీ కూడా 26 నుంచి 22కి పడిపోయింది. 60 శాతం కెనడియన్లు ట్రూడోని ఓడించాలనే పట్టుదలతో ఉన్నారు.

భారత్ నుంచి పారిపోయి కెనడా పౌరసత్వం పొందిన హర్దీప్ సింగ్ నిజ్జర్ ఖలిస్తానీ వేర్పాటువాదానికి ప్రధాన నేతగా ఉన్నారు. పలు సందర్భాల్లో ఇండియాకు వ్యతిరేకంగా కెనడా నుంచి తన కార్యకలాపాలను చేస్తున్నారు. జూన్ నెలలో కెనడాలోని సర్రే ప్రాంతంలో అతడిని గుర్తుతెలియని వ్యక్తులు చంపారు. అయితే ఈ హత్యకు భారత్ కారణమంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో అక్కడి పార్లమెంట్ లో ఆరోపించారు. ఇండియా వీటిన అసంబద్ద, రాజకీయ ప్రేరేపిత వ్యాఖ్యలుగా ఖండించడంతో పాటు కెనడా ఉగ్రవాదులకు స్వర్గధామంగా మారుతోందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది.