Justin Trudeau: జస్టిన్ ట్రూడోపై సొంత పార్టీ ఎంపీల అసంతృప్తి.. రాజీనామా చేయాలని డిమాండ్
- కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోపై సొంత పార్టీ ఎంపీల అసంతృప్తి..
- ప్రధాన మంత్రి పదవికి రాజీనామా చేయాలని లేఖపై సంతకం పెట్టిన 24 మంది శాసనసభ్యులు..
- అక్టోబర్ 28లోపు ప్రధాని పదవి నుంచి దిగిపోవాలని లిబరల్ పార్టీ ఎంపీల డిమాండ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Justin Trudeau: భారత్- కెనడా దేశాల మధ్య దౌత్య సంబంధాలు దిగజారుతున్న సమయంలో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోకి సొంత పార్టీ ఎంపీలు హెచ్చరికలు జారీ చేశారు. అక్టోబరు 28లోపు ప్రధాని పదవి నుంచి ట్రూడో తప్పుకోవాలి.. లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది పేర్కొన్నారు. జస్టిన్ ట్రూడో సొంత లిబరల్ పార్టీలోని కొంత మంది ఎంపీలు ఆయనకు వ్యతిరేకంగా కామెంట్స్ చేస్తుండడం గమనార్హం. జస్టిన్ ట్రూడో నాలుగో సారి పోటీ చేయొద్దని కూడా వారు కోరినట్లు సమాచారం. కాగా, వచ్చే ఏడాది కెనడాలో ఎన్నికలు జరగనున్నాయి.
Read Also: IND vs AUS: పక్కనపెట్టేందుకు కారణం ఏదీ లేదు.. సర్ఫరాజ్ తుది జట్టులో ఉండాల్సిందే!
Also Read
- IRCTC Sri Lanka Ramayana Yatra 2026: రామాయణ పుణ్యక్షేత్రాలతో శ్రీలంక టూర్.. విమానం, హోటల్, భోజనం అన్నీ ప్యాకేజీలోనే!
- Mohsen Rezaee: ఇరాన్ టాప్ సెక్యూరిటీ బాడీకి మాజీ IRGC చీఫ్.. మొహ్సెన్ రెజాయీ నియామకం ఎందుకంత కీలకం?
- Iran and US Tensions: ఇరాన్‌పై మారిన ట్రంప్ వ్యూహం..? ఇక సైనిక దాడులు ఉండవు..! కానీ..
- Israel: నేనున్నంత కాలం పాలస్తీనా దేశం ఉండదు: అమెరికాకు నెతన్యాహూ షాక్..
ఇక, ప్రధాన మంత్రిగా జస్టిన్ ట్రూడో ప్రజల మాటను ఇప్పటినుంచైనా వినాలని మరి కొందరు ఎంపీలు కోరారు. మరి కొందరు లిబరల్ పార్టీ ఎంపీలు మాత్రం అక్టోబర్ 28లోగా ట్రూడో రాజీనామా డిమాండ్ చేస్తున్నారు. తాజాగా జరిగిన ఓ సమావేశంలో పాల్గొన్న ఇమ్మిగ్రేషన్ మంత్రి మార్క్ మిల్లర్ మాట్లాడుతూ.. ఎంపీలు నిజంగా ప్రధానికి సత్యాలే చెబుతున్నారా? ఆ సత్యాలను వినాలని భావించే ఉద్దేశం జస్టిన్ ట్రూడోకి ఉందా? అని క్వశ్చన్ చేశారు.
Read Also: Old Phones: అమ్మిన పాత ఫోన్‌లతోనే సైబర్ లింక్..? అమ్మొద్దంటున్న సీఎస్‌బీ..
ఈ సందర్భంగా లిబరల్ పార్టీకి చెందిన ముగ్గురు ఎంపీలు కీలక వ్యాఖ్యలు చేశారు. తమతో పాటు 20 మంది శాసన సభ్యులతో కలిసి వచ్చే ఎన్నికలలోపు ప్రధాని జస్టిన్ ట్రూడో వైదొలగాలని కోరుతూ లేఖపై సంతకం చేశామని వెల్లడించారు. కాగా, ఆ పార్టీలోని 153 మంది శాసనసభ్యులలో 24 మంది జస్టిన్ ట్రూడో రాజీనామా కోరుతూ లేఖపై సంతకం చేసినట్లు కెనడియన్ మీడియా ఓ కథనం ప్రసారం చేసింది. మిగతా శాసనసభ్యుల్లో చాలా మంది జస్టిన్ ట్రూడోకి సపోర్ట్ ఇస్తున్నప్పటికీ ఆయన ఫీడ్‌బ్యాక్‌ను సీరియస్‌గా తీసుకోవాలని పేర్కొన్నారు. ట్రూడో మాత్రం తమ పార్టీ ఐక్యంగా ఉందని చెప్తున్నారు.. వచ్చే ఎన్నికల్లో కూడా తమ పార్టీని తానే నడిపిస్తానని వెల్లడించారు.
అయితే, అక్టోబరు 15న విడుదలైన నానోస్ రీసెర్చ్ పోల్ కన్జర్వేటివ్‌లకు 39 శాతం ప్రజలు మద్దతునిచ్చారు.. లిబరల్స్‌కు 23 శాతం, ప్రత్యర్థి లెఫ్ట్-లీనింగ్ న్యూ డెమోక్రాట్‌లకు 21 శాతం మద్దతు లభించింది. ఎన్నికల రోజున కూడా ఇలాంటి ఫలితం కన్జర్వేటివ్‌లకు అనుకూలంగా ఉంటుందని పలు సర్వేలు వెల్లడించాయి.
తాజావార్తలు
-
Tobacco Farmers: పొగాకు రైతులకు సర్కార్ గుడ్‌న్యూస్.. క్వింటాల్‌కు రూ.1,000 ప్రోత్సాహకం, వడ్డీలేని రుణాలు
-
KTM RC 160 Price Hiked: KTM RC 160 ధర పెంపు.. ఇప్పుడు ఎంతంటే? కొత్త ధర, ఇంజిన్, ఫీచర్ల పూర్తి వివరాలు
-
Lopamudra Raut Theft Case: బిగ్‌బాస్ ఫేమ్ ఇంట్లో భారీ చోరీ.. నిందితుడి అరెస్ట్, రూ.76 లక్షల సొత్తు స్వాధీనం!
-
Tollywood : ఇండస్ట్రీ సంక్షోభానికి కారణం స్టార్ హీరోలేనా? సింగిల్ స్క్రీన్లు మూతపడటానికి బాధ్యులెవరు?
-
AP PPP Policy 2026కు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. కీలక ఉత్తర్వులు జారీ
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!