NTV Telugu Site icon

భార‌త్ విమానాల‌పై బ్యాన్ పొడిగించిన ఆ దేశం

flight

భార‌త్‌లో క‌రోనా సెకండ్ వేవ్ క‌ల్లోలం సృష్టిస్తూనే ఉంది.. 2.5 ల‌క్ష‌ల‌కు పైగా పాజిటివ్ కేసులు న‌మోదు అవుతుండ‌గా.. 4 వేల‌కు పైగా మ‌ర‌ణాలు సంభ‌విస్తున్నాయి.. ఈ త‌రుణంలో.. భారత నుంచి విమానాల రాక‌పోక‌ల‌పై విధించిన బ్యాన్‌ను పొడిగించింది కెన‌డా ప్ర‌భుత్వం.. జూన్ 21వ తేదీ వ‌ర‌కు బ్యాన్ కొన‌సాగుతోంద‌ని స్ప‌ష్టం చేసింది.. కాగా, కోవిడ్ నేపథ్యంలో ఏప్రిల్‌ 22న భారత్‌తో పాటు పాకిస్థాన్‌‌ విమానాలపై బ్యాన్ విధించింది కెన‌డా.. ఈ రెండు దేశాల నుంచి వచ్చే ప్రయాణీకుల్లో చాలా మందికి పాజిటివ్ గా తేల‌డంతో.. ఈ నిర్ణ‌యం తీసుకుంది.. ఇక‌, ప్రస్తుతం క‌రోనా ఉధృతి కొన‌సాగుతూనే ఉండ‌డంతో.. ట్రావెల్ బ్యాన్‌ను పొడిగించింది.